ఎంపీ రఘురామ కృష్ణం రాజు కేసులో సుప్రీం కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. రఘురామకు బెయిల్ మంజూరు చేయాలని, ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని, అవసరమైతే ఆర్మీ ఆసుపత్రిలో అయినా వైద్య పరీక్షలు నిర్వహించేలా అనుమతులు ఇవ్వాలని రఘురామ తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఇప్పటి వరకు రఘురామను ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించలేదని ముకుల్ రోహత్గి కోర్టుకు తెలియజేశారు. ఇక ఏపీ సిఐడి తరపున దుశ్యంత్ దవే వాదనలు వినిపించారు. కేసును శుక్రవారానికి వాయిదా వేయాలని, శుక్రవారానికి […]
అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ తుఫాన్ ఇప్పుడు పెను తుఫాన్ గా మారి అరేబియా తీరప్రాంతంలోని రాష్ట్రాలపై విరుచుకుపడింది. ఇప్పటికే కేరళ, తమిళనాడులోని కన్యాకుమారి, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలపై ప్రభావం చూపించింది. ప్రస్తుతం తీవ్రమైన తుఫాన్ గా మారి గుజరాత్ వైపు పయనిస్తోంది టౌటే తుఫాన్. ఈరోజు సాయంత్రం వరకు టౌటే తుఫాన్ గుజరాత్ తీరాన్ని చేరుతుంది. దీంతో ఆ రాష్ట్రంలోని 15 జిల్లాలను అక్కడి ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎలాంటి విపత్తు […]
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఒకవైపు కరోనా కేసులను కంట్రోల్ చేసేందుకు లాక్ డౌన్, కర్ఫ్యూ వంటివి అమలు చేస్తూనే, మరోవైపు వ్యాక్సిన్ అందిస్తున్నారు. వ్యాక్సిన్ కొరత ఉన్నప్పటికి వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలో మొత్తం 18,29,26,460 మందికి వ్యాక్సిన్ అందించారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కొందరికి కరోనా సోకుతుండగా, మరికొందరు కరోనాతో మృతి చెందుతున్నారు. ఇలాంటి కేసులు అతి తక్కువగా నమోదవుతున్నాయి. అయితే, కరోనా వైరస్ కు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 97.38శాతం […]
ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. పాజిటీవ్ కేసులు గత రెండు రోజులుగా తగ్గుతున్నా మరణాల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్రం ప్రజలను హెచ్చరిస్తోంది. తాజాగా దేశంలో 2,81,386 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,49,65,463కి చేరింది. ఇందులో 2,11,74,076 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 35,16,997 కేసులు ఇంకా యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో 4,106 మంది మృతి […]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో రాష్ట్రంలో ప్రస్తుతం కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అయితే, ప్రతిరోజు భారీగా కేసులు నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అనంతపురం జిల్లాలో నిన్నటి రోజున కేసులు 3 వేలకు పైగా నమోదయ్యాయి. మొదటిసారి కేసులు 3 […]
చేయని తప్పుకు ఇద్దరు సోదరులు ముప్పై ఏళ్ళు జైలు శిక్ష అనుభవించారు. 30 ఏళ్ల తరువాత వారు తప్పు చేయలేదని తెలియడంతో ఇద్దరిని నిర్దోషులుగా విడుదల చేశారు. అయితే, చేయని తప్పుకు శిక్ష అనుభవించి విలువైన కాలాన్ని కోల్పోయిన ఇద్దరు అన్నదమ్ములు కోర్టులో కేసు ఫైల్ చేయగా కోర్టు వారికి రూ.550 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సంఘటన అమెరికాలోని నార్త్ కరోలీనాలో జరిగింది. 1983లో 11 ఏళ్ల బాలికను అత్యాచారం […]
కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు దేశంలో ప్రస్తుతం మూడు రకాల ఔషదాలు అందుబాటులో ఉన్నాయి. కోవిషీల్డ్, కోవాగ్జిన్ తో పాటుగా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది. కాగా, ఇప్పుడు డిఆర్డిఓ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తో కలిసి ఓ ఔషధాన్ని తయారు చేసింది. అది 2 డిజీ ఔషధం. రెడ్డీస్ ల్యాబ్స్ దీనిని ఉత్పత్తి చేస్తున్నది. ఈరోజు ఈ ఔషధాన్ని రిలీజ్ చేస్తున్నారు. రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వర్చువల్ విధానం ద్వారా ఈరోజు […]
కరోనా వైరస్ నిత్యం మార్పులు చెందుతూ కొత్త కొత్త వేరియంట్లుగా మార్పులు చెందుతున్న సంగతి తెలిసిందే. జ్వరం, జలుబు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, రుచి, వాసన కొల్పోవడం వంటి లక్షణాలను కరోనా లక్షణాలుగా ఇప్పటి వరకూ పేర్కొంటూ వస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ లిస్ట్ లో మరికొన్ని లక్షణాలు కూడా చేరాయి. కొంత మందిలో నాలుక ఎర్రబారడం, ఎండిపోవడం, దురదగా అనిపించడం, నాలుకపై గాయాలు కావడం వంటివి కూడా కరోనా లక్షణాలుగా గుర్తించారు. ఈ లక్షణాలు ఉంటే […]
హైదరాబాద్‌లోని నారాయణగూడాలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నారాయణగూడాలోని అవంతి నగర్లో ఓ ఇంట్లో అర్ధరాత్రి సమయంలో సడెన్ మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. వెంటనే స్పందించిన పోలీసులు ప్రమాదంలో చిక్కుకున్న ఐదుగురిని కాపాడి సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ ఆగ్ని ప్రమాదంలో ఒకరు మృతి చెందారని పోలీసులు పేర్కొన్నారు. ఇక, ఈ అగ్ని ప్రమాదం జరగడానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేదంటే మరేమైనా కారణాలు […]