కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఇంకా కోలుకోలేదు. ముప్పుభయంతోనే ప్రజలు జీవనం సాగిస్తున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో కొంత భయం తగ్గినప్పటికీ, వైరస్ వేరియంట్ లు భయపెడుతున్నాయి. వృద్దులపై వ్యాక్సిన్ ఏ మేరకు పనిచేస్తున్నది అనే విషయంపై యూనివర్శిటి కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు పరిశోధనలు చేశారు.
Read: చిరంజీవిని ఎందుకు లాగుతున్నారు ? : ప్రకాష్ రాజ్
60 ఏళ్లు పైబడిన వృద్దులు సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవడం వలన 60 శాతం మేర ముప్పు తప్పుతుందని పరిశోధకుల పరిశోధనలో తేలింది. కరోనాపై ఫైజర్, కోవీషీల్డ్ టీకాలు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయని, కనీసం ఒక్క డోసు తీసుకుంటే 28-34 రోజుల్లో 56 శాతం, 38-45 రోజుల తరువాత 62 శాతం కరోనా బారిన పడే ముప్పు తగ్గుతందని పరిశోధకులు చెబుతున్నారు.