ప్రపంచంలో ఖరీదైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి కార్పోరేట్ ఆసుపత్రుల్లో చేరితే అయ్యె ఖర్చు ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఖరీదైన మెడిసిన్‌ను వినియోగిస్తుంటారు. అయితే, ప్రపంచంలో ఖరీదైన మెడిసిన్ ఎంటి? ఎంత ఉంటుంది? అంటే చెప్పడం కష్టం అవుతుంది. ప్రపంచంలో ఖరీదైన మెడిసిన్ ఎంటి అంటే జోల్జెన్‌స్మా. ఈ మెడిసిన్ ను అత్యంత అరుదైన స్పైనల్ మస్కులార్ అట్రోపి చికిత్సకు వినియోగిస్తారు. ఎస్ఎంఏ అరుదైన వ్యాధి. ఈ వ్యాధి చిన్నపిల్లలకు వస్తుంది. ఈ వ్యాధి సోకిన పిల్లల్లో పక్షవాతం, కండరాలు పనిచేయకపోవడం, ముఖ్యమైన అవయాలు పనిచేయకపోవడం వంటివి జరుగుతుంది. కోన్నాళ్లకు మరణించే అవకాశం ఉంటుంది.
Read: హీరోయిన్లతో కలిసి సినిమాను వీక్షించిన అక్షయ్…!
అందుకే ఈ వ్యాధిసోకిన పిల్లలపై తల్లిదండ్రులు ఆశలు వదిలేసుకుంటారు. ప్రముఖ ఫార్మా దిగ్గజం నోవార్టిస్ సంస్థ ఈ జోల్జెన్‌స్మా మెడిసిన్‌ను తయారు చేస్తుంది. ఈ మెడిసిన్ డోసు విలువ అక్షరాల రూ.18.20 కోట్లు. అయితే ఈ మెడిసిన్ తీసుకున్నాక పిల్లలకు ఆ వ్యాధి పూర్తిగా నయం అవుతుందని చెప్పడం కష్టం. డోస్ తీసుకుంటే వెంటిలేటర్ సహాయం లేకుండా శ్వాస తీసుకోవడం, మెల్లిగా పాకడం, నడవడం వంటివి చేస్తుంటారు. ఒనసెమ్నోజీన్ అబెపార్వోవెక్ అనేది ఈ మెడిసిన్ శాస్త్రీయనామం.