Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో “మాస్క్ మ్యాన్”.. ఎవరనేది తెలిసింది
- ఖమేనీ అంత్యక్రియల్లో ముసుగు వ్యక్తిపై వీడిన మిస్టరీ.
- మొజ్తబా కాదని, మనవడు మొహమ్మద్ జావద్ ఖమేనీ అని వెల్లడి.
- అమెరికా-ఇజ్రాయిల్ దాడుల్లో ముఖానికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.
- మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై ఇంకా కొనసాగుతున్న ఊహాగానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khamenei Funeral: ఇరాన్ మాజీ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ముగిశాయి. కోట్లాది సంఖ్యలో ఇరాన్ ప్రజలు అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయిల్ దాడుల్లో ఖమేనీతో సహా ఆయన కుటుంబీలకు చనిపోయారు. దాదాపు 4 నెలల తర్వాత ఖమేనీ అంత్యక్రియలు ఆయన స్వస్థలం మషాద్‌లో ముగిశాయి. అయితే, ఈ అంత్యక్రియల్లో ‘‘మాస్క్’’ ధరించిన వ్యక్తిపై అంతా ఆసక్తి నెలకొంది. అతను ఎవరనే దానిపై పలు రకాలు కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుత సుప్రీం లీడర్, ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ మాస్క్ ధరించి వచ్చాడనే ఊహాగానాలు కూడా వ్యక్తమయ్యాయి.
అయితే, మాస్క్ మ్యాన్ మొజ్తబా ఖాదని తేలింది. ఇరాన్ మీడియా ఇతడిని ఖమేనీ పెద్ద మనవడిగా గుర్తించింది. అంత్యక్రియల ప్రార్థన సమయంలో నల్లని ఫేస్ మాస్క్, నల్లని బేస్‌బాల్ క్యాప్ ధరించిన ఒక వ్యక్తి ముందు వరుసలో కూర్చుని కనిపించారు. ముసుగు ధరించిన ఆ వ్యక్తిని ఖమేనీ పెద్ద మనవడు మొహమ్మద్ జవాద్ ఖమేనీగా గుర్తించారు. అతను ఖమేనీ కుమారుడు మొజ్తాబా ఖమేనీ (అతను ఖమేనీకి కాబోయే వారసుడిగా విస్తృతంగా పరిగణించబడుతున్నారు) అని విస్తృత ఊహాగానాలు చెలరేగాయి.
Also Read
ఫిబ్రవరి 28 దాడిలో జవాద్ ముఖంపై తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ కారణాల వల్లే అంత్యక్రియలకు హాజరైనప్పుడు అతను మాస్క్ ధరించాల్సి వచ్చిందని చెబుతున్నారు. మరోవైపు, ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలేదు. యూఎస్ ఇంటెలిజెన్స్ ప్రకారం.. దాడుల్లో మొజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడి, ముఖం వికృతంగా మారిందని చెబుతోంది. దాడి జరిగిన సమయంలో మొజ్తబా తన తండ్రి నివాసంలోనే ఉన్నారని, వేరే గదిలో ఉండటంతో తీవ్ర గాయాలతో బయటపడ్డారని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?