Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే డ్రీమ్ రోల్ ఇదేనట.. రాజమౌళి పేరు చెప్పి షాకిచ్చిన హీరోయిన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhagyashri Borse: టాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. తాజాగా ఈ బ్యూటీ నటించిన లెనిన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఈ సందర్భంగా భాగ్యశ్రీ బోర్సే ఒక ఇంటర్వ్యూలో
తన డ్రీమ్ రోల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భవిష్యత్తులో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో నటించాలని తనకు ఎంతో పెద్ద కోరిక ఉందని వెల్లడించారు. అంతేకాకుండా భారీ సెట్స్, గ్రాండ్ విజువల్స్‌తో కూడిన సినిమాలో రాణి (క్వీన్) పాత్రను పోషించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
తాజా ఇంటర్వ్యూలో భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ.. “రాజమౌళి సర్ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఆయన భారతీయ సినీ పరిశ్రమలో ఒక లెజెండ్. ఆయన దర్శకత్వంలో ఒక్క సినిమా చేసే అవకాశం వచ్చినా అది నా కెరీర్లో గొప్ప మైలురాయిగా భావిస్తాను” అని అన్నారు. అంతేకాకుండా, తాను కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కావాలనుకోవడం లేదని, నటిగా తన ప్రతిభను నిరూపించుకునే విభిన్న పాత్రల్లో కనిపించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ఒక రాజ్యానికి రాణిగా కనిపించే ‘లార్జర్ దాన్ లైఫ్’ పాత్రలో నటించడం తన కల అని వెల్లడించారు. అలాంటి పాత్ర కోసం భారీ సెట్స్, అద్భుతమైన విజువల్స్‌తో కూడిన సినిమా చేయాలని ఉందని పేర్కొన్నారు. భాగ్యశ్రీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాజమౌళి సినిమాల్లో నటించాలనేది దాదాపు ప్రతి నటుడి కలే అయినప్పటికీ, క్వీన్ పాత్రపై భాగ్యశ్రీ తన మనసులోని కోరికను బయటపెట్టడం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. భవిష్యత్తులో ఆమె కోరిక నెరవేరుతుందా? రాజమౌళి సినిమాలో అవకాశం దక్కుతుందా? అనే ఆసక్తి సినీ అభిమానుల్లో నెలకొంది.
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?