మేషం : ఉద్యోగస్తులకు అధికారులతో పర్యటనలు, ఒత్తిడి అధికం. పెద్ద మొత్తం ధన సహాయం క్షేమం కాదు. మీరంటే అందరికీ గౌరవం ఏర్పడుతుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. భాగస్వామిక ఒప్పందాల్లో మీ నిర్ణయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. గుట్టుగా యత్నాలు సాగించండి. వృషభం : బాధ్యతాయుతంగా వ్యవహరించి అధికారుల మన్నలు పొందుతారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు […]
కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే దేశం కోలుకుంటోంది. దేశంలో ప్రస్తుతం మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. రోజుకు లక్షల మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే, డిమాండ్‌కు సరిపడినన్ని వ్యాక్సిన్లు లేకపోవడంతో అత్యవసర వినియోగం కింద మరో వ్యాక్సిన్ ను దిగుమతి చేసుకోవడానికి అనుమతులు లభించినట్టు సమాచారం. కరోనా మహమ్మారిపై సమర్ధవంతంగా పనిచేస్తున్న మోడెర్నా వ్యాక్సిన్‌ను ఇండియాలో దిగుమతి, అమ్మకాల కోసం ప్రముఖ ఫార్మా కంపెనీ సిప్లా డీసీజీఐ కు ధరఖాస్తు చేసుకోగా, అనుమతులు మంజూరు చేసినట్లు […]
మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం దిశా చట్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం దిశాయాప్‌ను రూపోందించింది. ఈ యాప్ ప్రచార కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. కృష్ణాజిల్లాలోని గొల్లపూడిలో దిశాయాప్ ప్రచార కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ప్రభుత్వం రూపోందించిన ఈ యాప్ నాలుగు అవార్డులు గెలుచుకుందని, ప్రతి మహిళ దిశాయాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని అన్నారు. Read: ఆ జిల్లాలో సెల్ఫీలు నిషేదం… అతిక్రమిస్తే జైలు శిక్ష… దిశాయాప్‌పై ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని తెలిపారు. […]
సెల్ఫీలు ఈ రోజుల్లో కామన్ అయింది. స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తరువాత సెల్పీల విప్లవం మొదలైంది. ఎక్కడ కావాలంటే అక్కడ సెల్ఫీలు దిగుతున్నారు. కొన్నిసార్లు ఈ సెల్ఫీలు ప్రమాదానికి కారణం అవుతుంటాయి. ప్రమాదకరమైన ప్రాంతాల్లో సెల్ఫీలు దిగి ప్రాణాలమీదకు తెచ్చుకుంటూ ఉంటారు. దీనికి చెక్ పెట్టేందుకు గుజరాత్‌లోని దంగ్ జిల్లా అధికారులు రంగంలోకి దిగారు. జిల్లాలో సెల్ఫీలపై నిషేదం విధించారు. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడంతో గుజరాత్‌లోని సాత్పురా టూరిస్ట్ ప్రదేశానికి ఎక్కువ మంది పర్యటకులు వస్తుంటారు. […]
ఉత్తర కొరియాలో అక్కడి నియమాలకు విరుద్దంగా ఏం చేసినా కఠినమైన శిక్షలు విధిస్తారు. ప్రభుత్వం ఎలా చెబితే అక్కడి ప్రజలు అలా నడుచుకోవాల్సిందే. అతిక్రమించి ఎవరూ కూడా అక్కడ బతికి బట్టకట్టలేరు. తినే ఆహారం దగ్గర నుంచి, కట్టుకునే బట్ట వరకు ప్రభుత్వం నిర్ణయించిన మేరకే ఉండాలి. బట్టల విషయంలో కిమ్ ప్రభుత్వం చాలా సీరియస్‌గా వ్వవహరిస్తుంది. Read: వైరల్ః బర్త్‌డే పార్టీకి ఆ సింహమే చీఫ్ గెస్ట్…నెటిజన్లు ఆగ్రహం కొరియా సంస్కృతికి విరుద్ధంగా ప్రజలు […]
పుట్టినరోజు వేడుకలను ఒక్కొక్కరు ఒక్కోవిధంగా జరుపుకుంటు ఉంటారు. అయితే కొంతమంది జరుపుకునే పుట్టినరోజు వేడుకలు వివాదాస్పదంగా మారుతుంటాయి. నెటిజన్ల చేత చివాట్లు పెట్టిస్తుంటాయి. పాకిస్తాన్ కు చెందిన సునాన్ ఖాన్ అనే మహిళ తన పుట్టినరోజు వేడుకలను లాహోర్‌లోని ఓ హోటల్లో గ్రాండ్‌గా జరుపుకున్నది. ఈ వేడుకలకు చీఫ్ గెస్ట్ గా ఆమె సింహాన్ని తీసుకొని వచ్చింది. ఆ సింహాన్ని గొలుసుతో కట్టేసి, కుర్చీపై కూర్చోపెట్టారు. దాని చుట్టు చేరి డ్యాన్స్ చేస్తూ వీడియో దిగారు. […]