పుట్టినరోజు వేడుకలను ఒక్కొక్కరు ఒక్కోవిధంగా జరుపుకుంటు ఉంటారు. అయితే కొంతమంది జరుపుకునే పుట్టినరోజు వేడుకలు వివాదాస్పదంగా మారుతుంటాయి. నెటిజన్ల చేత చివాట్లు పెట్టిస్తుంటాయి. పాకిస్తాన్ కు చెందిన సునాన్ ఖాన్ అనే మహిళ తన పుట్టినరోజు వేడుకలను లాహోర్‌లోని ఓ హోటల్‌లో గ్రాండ్‌గా జరుపుకున్నది. ఈ వేడుకలకు చీఫ్ గెస్ట్ గా ఆమె సింహాన్ని తీసుకొని వచ్చింది. ఆ సింహాన్ని గొలుసుతో కట్టేసి, కుర్చీపై కూర్చోపెట్టారు. దాని చుట్టు చేరి డ్యాన్స్ చేస్తూ వీడియో దిగారు.
Read: జపాన్‌లో హికికోమోరి విధానం… ఏళ్లకు ఏళ్లు ఇంటికే పరిమితం…
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా యానిమల్ కేర్ టేకర్ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సునాన్ ఖాన్ పై చర్యలు తీసుకునేందుకు సిద్దం అవుతున్నారు. ఇక నెటిజన్లు సునాన్ ఖాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు కూడా మత్తు ఇచ్చి, గొలుసుతో కట్టేసి అలా కూర్చోబెడితే ఆ బాధ తెలుస్తుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.