సెల్ఫీలు ఈ రోజుల్లో కామన్ అయింది. స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తరువాత సెల్పీల విప్లవం మొదలైంది. ఎక్కడ కావాలంటే అక్కడ సెల్ఫీలు దిగుతున్నారు. కొన్నిసార్లు ఈ సెల్ఫీలు ప్రమాదానికి కారణం అవుతుంటాయి. ప్రమాదకరమైన ప్రాంతాల్లో సెల్ఫీలు దిగి ప్రాణాలమీదకు తెచ్చుకుంటూ ఉంటారు. దీనికి చెక్ పెట్టేందుకు గుజరాత్‌లోని దంగ్ జిల్లా అధికారులు రంగంలోకి దిగారు. జిల్లాలో సెల్ఫీలపై నిషేదం విధించారు. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడంతో గుజరాత్‌లోని సాత్పురా టూరిస్ట్ ప్రదేశానికి ఎక్కువ మంది పర్యటకులు వస్తుంటారు.
Read: ఉత్తర కొరియాలో ఆ రంగు జీన్స్ ధరిస్తే… ఇక అంతే…
అక్కడి అందాలను వీక్షిస్తూ సెల్ఫీలు దిగుతుంటారు. ఈ సెల్ఫీలు తీసుకుంటు అనేక మంది ప్రాణాలు కోల్పోతుండటంతో అక్కడి అధికారులు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రకృతి అందాలను వీక్షించడంలో తప్పులేదని, కానీ, ఇలా సెల్ఫీలు దిగడం వలన ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా సరే నిబంధనలను ఉల్లంఘించి సెల్ఫీలు దిగితే జరిమానాతో పాటుగా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.