ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ప్రతి ఒక్కరికి వారి జీవితంపై ఎన్నో కలలు ఉంటాయి. ఆ కలను నెరవేర్చుకోవడానికి అహర్నిశలు కష్టపడుతుంటారు. అయితే, కరోనా మహమ్మారి ఆ కలలపై నీళ్లు చల్లింది. కష్టపడి సాధించుకున్న ఉద్యోగాలు పోయి కోట్లాదిమందిని రోడ్డున పడేసింది ఈ మహమ్మారి. కొంతమంది జీవితంలో ఏదేతే సాధించాలని అనుకున్నారో, అది సాధించి ఆ ఫలాలు చేతికి అందే సమయానికి కరోనా మహమ్మారికి బలైపోతున్నారు. బీహార్‌కు చెందిన అవినాశ్ అనే వ్యక్తికి చిన్నప్పటి […]
ప్రయాణికుల కోసం ఈయూ గ్రీన్ పాస్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. వివిధ దేశాల ప్రయాణికులు ఈయూదేశాల్లో ప్రయాణం చేసేందుకు వీలుగా ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. కరోనా మహమ్మారి నేసథ్యంలో టీకా తీసుకున్న వారికి ఈ విధానం వర్తిస్తుంది. అయితే, నాలుగు రకాల టీకాలు తీసుకున్న వారికి మాత్రమే ఈ గ్రీన్ పాస్‌లు వర్తిస్తాయని మొదట పేర్కొన్నది. మోడెర్నా, ఫైజర్, అస్త్రాజెనకా, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలకు మాత్రమే గ్రీన్ పాస్ లు ఇస్తామని తెలిపింది. […]
2017లో టాలీవుడ్‌ను డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించింది. డ్రగ్స్‌కు సంబందించి మొత్తం 12 కేసులను ఎక్సైజ్ పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులో సిట్ ఇప్పటికే ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. కాగా, ఈ ఛార్జ్‌షీట్‌కు కోర్టు ఆమోదం తెలిపింది. ఈ కేసులో మొత్తం 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 27 మందిని అధికారులు విచారించారు. Read: విచిత్రమైన స్టైల్ తో… హాలీవుడ్ స్టార్ ని కాపీ కొట్టి… అడ్డంగా దొరికేసిన రణవీర్! 60 […]
డాక్టర్స్ డే సందర్బంగా ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. కరనా సమయంలో వైద్యులు చేసిన సేవలను కొనియాడారు. వైద్యసదుపాయాలను మెరుగుపరిచామని ప్రధాని మోడి పేర్కొన్నారు. కరోనా రోగులకు చికిత్స అందిస్తూ అనేక మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనడంలో వైద్యులు ముందు వరసలో ఉన్నారి, వారి ప్రాణాలు పణంగా పెట్టి కొట్లాదిమంది ప్రజల ప్రాణాలు కాపాడారని ప్రధాని పేర్కొన్నారు. వైద్యరంగం కోసం రూ.2 లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్టు ప్రధాని […]
మొన్నటి వరకు కరనా మహమ్మారి అమెరికాను భయపెట్టింది. వేగంగా వ్యాక్సినేషన్‌ను అమలు చేయడంతో ప్రస్తుతం అక్కడ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో మాస్క్ తప్పనిసరిగా విధానానికి స్వస్తి పలికారు. అయితే, ఇప్పుడు ఆ దేశాన్ని మరోసమస్య వేధిస్తోంది. అమెరికాను హీట్ వేవ్ ఇబ్బందులు పెటుతున్నది. గత కొన్ని రోజులుగా ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో వేడిగాలులు వీస్తున్నాయి. వేసవి కాలం ప్రారంభంలో 49 డిగ్రీలకు పైగా ఉష్ణ్రోగ్రతలు నమోదవుతున్నాయి. గతంలో […]
చైనాలో కమ్యునిస్టు పార్టీ ఆవిర్భవించి వందేళ్లు పూర్తైన సందర్బంగా బీజింగ్‌లోని తీయాన్మెన్ స్క్వేర్‌లో భారీ సభను నిర్వహించారు. ఈ సభకు 70 వేలమంది చైనీయులు హాజరయ్యారు. వీరిని ఉద్దేశించి చైనా అధ్యక్షుడు జీజిన్‌పింగ్ ప్రసంగించారు. ప్రపంచంలో చైనా ఒక బలమైన శక్తిగా ఆవిర్భవించిందని, చైనాను ఇప్పుడు ఎవరూ వేధించినా వారి సంగతి చూస్తామని జిన్‌పింగ్ తెలిపారు. తైవాన్ విషయంలో తమ నిర్ణయం ఎప్పటికీ ఒకేలా ఉంటుందని, తైవాన్‌ను విలీనం చేసుకొని తీరతామని జిన్‌పింగ్ పేర్కొన్నారు. Read: […]
భారత్‌లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. రెండు డోసుల స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌కు ఇప్పటికే అనుమతులు లభించాయి. వ్యాక్సిన్‌ను అనేక ప్రాంతాల్లో అందిస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌ను రెడ్డీస్ సంస్థ రష్యానుంచి దిగుమతి చేసుకొని పంపిణీ చేస్తున్నది. అయితే, రష్యాలో ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసిన గమలేరియా సంస్థ సింగిల్ డోస్ లైట్ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. లైట్ వెర్షన్ డోసులను రష్యాలో ప్రజలకు అందిస్తున్నారు. Read: అజిత్ అభిమాలకు గుడ్ న్యూస్… డబుల్ ట్రీట్…!! […]
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కు జేఎన్‌టీయు కు చెందిన ముగ్గురు విద్యార్ధులు ఎంపికయ్యారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో ముగ్గురు విద్యార్ధులను మైక్రోసాఫ్ట్ సంస్థ ఎంపిక చేసుకుంది. సాయి అస్రిత్ రెడ్డి, స్పూర్తిరాజ్, మహ్మద్ మూర్తుజాలు ఎంపికైనట్టు ఆ టెక్ దిగ్గజ సంస్థ తెలియజేసింది. సంవత్సరానికి రూ.41 లక్షల వేతనంతో వీరిని ఎంపిక చేసుకున్నది. జేఎన్‌టీయు నుంచి మైక్రోసాఫ్ట్‌కు ఎంపికైన వారిలో వీరిదే అత్యధిక వేతనం కావడం విషేషం. మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదేళ్ల ఎంపికయ్యాక ఆ సంస్థలో భారతీయులకు […]
గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం నడుస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతానికి నీటి విషయంలో అన్యాయం జరిగిందని పెద్ద ఎత్తున అప్పట్లో ఉద్యమాలు చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో నీరు, ప్రాజెక్టులు కీలక పాత్ర పోషించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఏడేళ్లు గడిచినా ఇంకా జలవివాదాలు జరుతూనే ఉన్నాయి. ఏపీలో పోతిరెడ్డిపాడు ఎత్తిపోతలపై తెలంగాణ ప్రభుత్వం అభ్యతరం తెలిపింది. Read: డాక్టర్స్ కు సెల్యూట్ చేస్తున్న స్టార్ హీరోలు ఇక, ఇదిలా […]