ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన, కోరిక ఉంటుంది. పెళ్లి కొందరి కల అయితే, అందరికంటే భిన్నంగా హనీమూన్ జరుపుకోవాలని కొందరికి ఉంటుంది. అంతరిక్షంలో హనీమూన్ జరుపుకోవడం సాధ్యమేనా అంటే, ఒకప్పుడు సాధ్యం కాకపోవచ్చు. కానీ, ఇప్పుడు సైన్స్ అభివృద్ధి చెందిందిం. చంద్రుని మీదకు వెళ్లి వస్తున్న తరుణంలో అంతరిక్షంలో హనీమూన్ ఎందుకు సాధ్యంకాదు. అంతరిక్షంపై ఉన్న మక్కువ, ఆసక్తితో థామస్ వైట్‌సైడ్స్, లోరెట్టాలు 2006లో వివాహం చేసుకున్నారు. అప్పటికే అంతరిక్ష ప్రయాణాలపై పరిశోధనలు చేస్తున్న వర్జిన్ ఎయిర్‌లైన్స్ సంస్థకు చెందిన వర్జిన్ గెలాక్టిక్ కు వీరు 2 లక్షల డాలర్లు చెల్లించారు.
Read: నేడు ఇండియాలో తగ్గిన కరోనా కేసులు…
2007 లో ఈ మొత్తాన్ని చెల్లించారు. కాగా 14 ఏళ్ల తరువాత వీరి కల నెరవేరబోతున్నది. 2021, జులై 11 వ తేదీన వర్జిన్ గెలక్టిక్ అంతరిక్షంలోకి మనుషులను విజయవంతంగా తీసుకెళ్లి వెనక్కి తీసుకొచ్చింది. 90 నిమిషాల ఈ ప్రయాణాన్ని విజయవంతం చేయడంతో దంపతుల అంతరిక్ష హనీమూన్ యాత్ర తప్పకుండా నెరవేరుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం థామస్ వైట్‌సైడ్స్ వర్జిన్ గెలాక్టిక్‌కు సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తుండగా, లోరెట్టా యూరిస్ నైట్‌కు సహ వ్యవస్ధాపకురాలి హోదాలో ఉన్నారు. త్వరలోనే ఆ దంపతులు తమ కలను నెరవేర్చుకోబుతున్నారు.