జమ్మూకశ్మీర్‌లో మళ్లీ డ్రోన్ కలకలం సృష్టించింది. శుక్రవారం తెల్లవారుజామున అక్నూర్ సెక్టార్ పరిధిలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద డ్రోన్ కనిపించడంతో ఇండియన్ ఆర్మీ కాల్పులు జరిపి డ్రోన్‌ను కూల్చివేశారు. ఈ డ్రోన్‌కు 5 కేజీల ఐఈడీ బాంబు అమర్చి ఉండటంతో వెంటన్ ఆర్మీ అధికారులు ఆ డ్రోన్‌ను స్వాదీనం చేసుకున్నారు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా పెద్ద విధ్వంసం జరిగి ఉండేదని, ఈ డ్రోన్ కుట్ర వెనుక లష్కరే తోయిబా ఉగ్రవాద హస్తం ఉండి ఉంటుందని ఆర్మీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 27 వ తేదీన జమ్మూకశ్మీర్‌లోని వైమానిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడి తరువాత భద్రతను కట్టుదిట్టం చేశారు. డ్రోన్‌లపై నిఘాను పెంచారు. అయినప్పటి నెల రోజుల కాలంలో పాక్ సరిహద్దుల నుంచి 6 సార్లు డ్రోన్లు ఇండియా బోర్డర్‌లోకి ప్రవేశించాయి.