కరోనా కాలంలో మాస్క్‌ల వాడకం అధికమయింది. కరోనా తరువాత ప్రపంచంలో వాడిపాడేసిన మాస్క్‌లతో కాలుష్యమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో టామ్ సిల్వర్ వుడ్ అనే డిజైనర్ డిస్పోజబుల్ మాస్క్‌లతో తెల్లని వెడ్డింగ్ గౌన్‌ను తయారు చేశారు. 1500 వాడి పడేసిన మాస్క్‌లతో ఈ వెడ్డింగ్ గౌన్‌ను తయారు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ గౌన్ తయారీకి ప్రముఖ వెడ్డింగ్ ప్లానర్ సంస్థ హిచ్డ్ ఆర్థిక సహాయం అందించింది. జెమియా హాంబ్రో అనే మోడల్ ఈ డ్రెస్‌ను ధరించి లండన్‌లోని సెయింట్ పాల్స్ క్యాథెడ్రల్ ముందు ఫోజులు ఇచ్చింది. ఇంగ్లాండ్‌లో ఫ్రీడం డే సందర్భంగా ఈ డ్రెస్‌ను డిజైన్ చేశారు. ఇక ఇదిలా ఉంటే, ఒక్క బ్రిటన్‌లోనే వారానికి వంద మిలియన్లకు పైగా మాస్క్‌లను వాడి పారేస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.
Read: మహేష్ “సరిలేరు నీకెవ్వరు”… హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ !