కరోనా మహమ్మారి జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ఎప్పుడూ ఆఫీసులు వదలని వ్యక్తులు పాపాం ఇంటినుంచే పనిచేయాల్సి వస్తున్నది. ప్రభుత్వం, ప్రైవేట్ అనే తేడా లేకుండా వీలైనంత వరకు వర్క్ ఫ్రం హోమ్ పనిచేస్తున్నారు. మహమ్మారి దెబ్బకు భయపడి అనేక సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగులకు పూర్తిస్తాయిలో ఇంటినుంచి పనిచేసే అవకాశాలు కల్పిస్తున్నారు. ఇక ఇంటినుంచే పనిచేస్తుండటంతో ఇంతకు ముందులాగా స్వేచ్చ దొరకడంలేదు. గతంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు సెలవులు దొరికేవి. కానీ, ఇప్పుడు సాధ్యం కావడం లేదు.
Read: రెయిన్ సాంగ్ కు నో అంటున్న ఇస్మార్ట్ బ్యూటీ
పెళ్లి చేసుకోవాలని అనుకున్నా సెలవులు ఇవ్వడం లేదట. దీంతో ఓ ఉద్యోగి పెళ్లి పీటల మీద నుంచే ఆఫీస్ వర్క్ చేయడం మొదలుపెట్టాడు. పెళ్లి మధ్యలో సమయం ఉన్నప్పుడు ల్యాప్‌ట్యాప్‌లో తలదూర్చి పనిచేస్తున్నాడు. వరుడు కష్టాలు చూసి వధువు నవ్వుకున్నది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. వర్క్ ఫ్రం వెడ్డింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.