కలియుగంలో ఎక్కడ ఎలాంటి వింతలు జరుగుతాయో తెలియడంలేదు. బ్రహ్మంగారు చెప్పినట్టుగా అన్ని వింత వింతలు జరుగుతున్నాయి. మనుషులు పాల కోసం ఆవులను పెంచుతుంటారు. కొన్ని ఆవులు ఎంత పితికినా పాలు ఇవ్వవు. కొన్ని వద్దన్నా పాలు ఇచ్చేస్తుంటాయి. అయితే, ఈ ఆవు మాత్రం అన్నింటికంటే స్పెషల్. ఈ ఆవు పొదుగును పితక్కపోయినా పాలు ఇచ్చేస్తుంది. ఈ విషయాన్ని ఆ ఆవు యజమాని వెంకటరమణారెడ్డి పేర్కొన్నాడు. చిత్తూరు జిల్లాలోని వడమాల మండలంలోని నెన్నూరు వెంకటరెడ్డి కండ్రిగ గ్రామంలోని వెంకటరమణారెడ్డికి […]
బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయంపై కొంతమంది దుండగులు దాడులు చేసి విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పరిస్థితులు చేజారిపోకుండా ఉండేందుకు అధికారులు ఆ ప్రాంతంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దేవాలయంపై దాడికి పాల్పడిన వారిగా అనుమానిస్తున్న 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన బంగ్లాదేశ్‌లోని ఖుల్నా జిల్లాలో చోటుచేసుకుంది. గత శుక్రవారం రోజున స్థానికుల మధ్య గొడవ జరిగిందని, ఆ తరువాతే దేవాలయంపై దాడులు జరిగాయని స్థానికుల […]
గ్లామర్ ప్రపంచంలో ఎవరు ఎప్పుడు ఫేడవుట్ అవుతారో తెలియదు. ఒక్కోసారి 21 ఏళ్ల యంగ్ బ్యూటీ కూడా ఆఫర్స్ అందుకోలేక చతికిలపడుతుంది. కానీ, గత 21 ఏళ్లుగా కరీనా యమ స్పీడుగా దూసుకొస్తూనే ఉంది. ఇద్దరు బేబీస్ కి తల్లి అయినా ఆమెని ఇంకా బేబీ అనటానికే ఇష్టపడతారు కుర్రాళ్లు. అటువంటి ఎవర్ గ్రీన్ బేబో ఇప్పుడు మరో కొత్త బాధ్యత నెత్తిన వేసుకుంటోంది! యాక్టర్ కరీనా ప్రొడ్యూసర్ గా మారనుంది… కరీనా నిర్మాతగా తొలి చిత్రం […]
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 494 కరోనా కేసులు నమోదైనట్టు తెలంగాణ ఆరోగ్యశాఖ పేర్కొన్నది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,50,353కి చేరింది. ఇందులో 6,38,410 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా.. 8,112 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కరోనాతో ముగ్గురు మృతిచెందినట్టు హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 3,831కి చేరింది. ఇక ఇదిలా […]
మాస్క్ లేకుండా బయటకు వస్తే భారీ జరిమానాలు విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, మాస్క్ పెట్టుకున్నప్పటికీ ఓ వ్యక్తికి జరిమానా విధించడంతో పాటుగా జైల్లో పెట్టారు. అదేంటి మాస్క్ ధరిస్తే జరిమానా వేయడం ఏంటి అనుకుంటున్నారా… అక్కడే ఉంది ట్విస్ట్. మామూలు మాస్క్ ధరిస్తే ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ, ఆ వ్యక్తి భయపెట్టే విధంగా కాస్ట్యూమ్ మాస్క్ ధరించాడు. భయపెట్టే విధంగా ఉన్న మాస్క్ ధరించి దారినపోయే వారిని భయపెడుతుండటంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని […]
బాలీవుడ్ లోని హాట్ ఫేవరెట్ డైరెక్టర్స్ లో సంజయ్ లీలా బన్సాలీ మొదటి వరుసలో ఉంటాడు. ఆయన సినిమాలో ఆఫర్ కోసం అప్ కమింగ్ ఆర్టిస్టులే కాదు అగ్రశ్రేణి తారలు కూడా తహతహలాడుతుంటారు. మరి ఆలియా ఇందుకు మినహాయింపు ఎందుకవుతుంది? ఆమె బన్సాలీ నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘హీరా మండీ’లో ఏదో ఒక క్యారెక్టర్ తనకు ఇవ్వమని రిక్వెస్ట్ చేసింది. ప్రస్తుతం బీ-టౌన్ లో ఆలియా ఫుల్ క్రేజ్ తో దూసుకుపోతున్నప్పటికీ ఎలాంటి భేషజం లేకుండా పాత్ర కావాలని […]
కరోనా తరువాత అన్ని రంగాలు తిరిగి తెరుచుకుంటున్నాయి. కరోనాకు కారణమైన చైనాలో పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో అన్ని రంగాలు తెరుచుకున్నాయి. పర్యాటక రంగం తిరిగి ప్రారంభమైంది. రాజధాని బీజింగ్‌లోని జూ వీకెండ్స్‌లో పర్యాటకులతో కిటకిటలాడుతున్నాయి. ఆదివారం రోజున పెద్దసంఖ్యలో పర్యాటకులు బీజింగ్ జూకు తరలి వచ్చారు. అయితే, జూలో ఉన్నట్టుండి ఇద్దరు పర్యాటకుల మధ్య గొడవ ప్రారంభమైంది. ఆ గొడవ చిలికి చిలికి గాలివానలా మారి రెండు కుటుంబాల మధ్య గొడవలా మారిపోయింది. రెండు కుటుంబాలకు […]
ఇంకా బాలీవుడ్ బిగ్ స్క్రీన్ పై కాలు మోపలేదు రశ్మిక మందణ్ణ. ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘మిషన్ మజ్నూ’ పూర్తి చేసింది. అమితాబ్, నీనా గుప్త కీలక పాత్రలు పోషిస్తోన్న ‘గుడ్ బై’ సినిమా షూటింగ్ కూడా ముగిసింది. అయితే, తన ఫస్ట్ టూ మూవీస్ ఇంకా రిలీజ్ కాకపోయినా రశ్మిక మాత్రం బీ-టౌన్ లో దుమారం రేపుతోంది. పాప్ సింగర్ బాద్షాతో ఓ వీడియో సాంగ్ లో ఆడిపాడిన అందాల […]
పర్యావరణంలో రోజురోజుకు అనేక మార్పులు వస్తున్నాయి. భూమిపై వేడి పెరిగిపోతున్నది. వాతావరణంలో వేడి పెరగడం వలన ధృవప్రాంతాల్లో మంచు విపరీతంగా కరిగిపోతున్నది. ఎప్పుడూ లేని విధంగా అర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లోని మంచు భారీస్థాయిలో కరుగుతున్నది. వేడికి గ్లేసియర్‌లు కరిగి సముద్రంలో కలిసిపోవడంతో నీటిమట్టం భారీగా పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై నాసా శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తున్నారు. వీరి పరిశోధనల్లో అనేక విషయాలు వెలుగుచూశాయి. నసా పరిశోధనల ప్రకారం 2100 నాటికి ఇండియాలోని 12 […]