తెలంగాణలోని హుజురాబాద్‌కు త్వరలోనే ఉప ఎన్నిక జరగనున్నది. ఈటల రాజీనామా తరువాత ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, టీఆర్ఎస్ నుంచి ఎవర్ని నిలబెడుతున్నారన్నది ఇప్పటి వరకు ఆసక్తికరంగా ఉంది. హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్ధిని పార్టీ ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా ఎన్నుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. […]
ఇండియాలో మళ్లీ కరోనా కేసులు పెరిగాయి. ప్రతిరోజు 30 నుంచి 40 వేల మధ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో 38,353 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,20,36,511 కి చేరింది. ఇందులో 3,12,20,981 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా.. 3,86,351 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 497 మంది మృతి చెందారు. […]
వర్షాలు కురిస్తే కొన్ని ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతుంటాయి. కొన్ని చోట్ల లంకెబిందెలు బయటపడుతుంటాయి. అయితే, మధ్యప్రదేశ్‌లో ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు గుణ జిల్లాల్లోని సింధ్ నది పొంగిపోర్లింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నది శాంతించింది. వరద నీరు వెనక్కి వెళ్లిన తరువాత నదీ తీరంలో వెండినాణేలు బయటపడ్డాయి. అశోక్‌నగర్‌లోని పంచ్‌వాలిలోని నదీతీరంలో ఈ నాణేలు బయటపడ్డాయి. కొంతమందికి పాతకాలం నాటి నాణేలు దొరకడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకొని నాణేల […]
ఆఫ్రికాలోని అల్జీరియా దేశంలో దారుణం చోటుచేసుకుంది. అల్జీరియాలోని కబైలియా రీజియన్‌లోని కొన్ని ప్రాంతాల్లో సడెన్‌గా పలుదఫాలుగా మంటలు చెలరేగాయి. హఠాత్తుగా మంటలు చెలరేగడంతో సైన్యం రంగంలోకి దిగి చిక్కుకున్న వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మంటల్లో ఇప్పటి వరకు 42 మంది మరణించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఇంతో 25 మంది సైనికులు, 17 మంది సాధారణ పౌరులు ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. పౌరులను రక్షించే క్రమంలో సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు […]
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం దృష్టి సారిందించి. 2014 నుంచి ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. తెలంగాణ ఏర్పాటు తరువాత కాంగ్రెస్ పార్టీపై ఏపీ ప్రజలు కోపంగా ఉన్నారు. ఆ కోపాన్ని ఎన్నికల్లో చూపించారు. అయితే, ఈ సంఘటనలు జరిగి ఏడేళ్లు గడిచింది. అయినప్పటికీ ఏపీలో పార్టీ ఇంకా కోలుకోలేకపోతున్నది. పార్టీని తిరిగి బలోపేతం చేసి తిరిగి గాడిలోకి తీసుకొస్తే ఎప్పటికైనా ఏపీలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అన్నది […]
కొంతమంది తమ ఆస్తులను పిల్లల పేరుమీద, సంస్థల పేరుమీద రాస్తుంటారు. కానీ, ఆక్కడ మాత్రం పావురాల పేరుమీద కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయట. పావురాల పేరుమీద 30 ఎకరాల భూమి, 27 షాపులు, బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో డబ్బు ఉందట. అదేంటి పావురాల పేరుమీద ఇంత మొత్తంలో ఆస్తులు ఉండటం ఎంటి? ఎవరు ఇదంతా ఎవరు చేశారు అనుకుంటున్నారా… అదే ఇప్పుడు చూద్దాం. రాజస్తాన్‌లోని నాగౌర్ పరిధిలో జస్నాగర్ అనే గ్రామం ఉన్నది. నాలుగు దశాబ్దాల కిందట […]
మేషం : వ్యాపార రీత్యా దూర ప్రయాణ చేయవలసి వస్తుంది. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. స్త్రీలకు నడుము, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు తప్పవు. మీ అలవాట్లు బలహీనతలు ఇబ్బందులకు దారితీస్తాయి. కోర్టు వ్యవహారాలు పరిష్కారమయ్యే సూచనలున్నాయి. వృషభం : స్త్రీలకు స్వీయ అర్చన, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. కపటం లేని ఆలోచనలు సలహాలు మీకు అభిమానులను సంపాధించి పెడుతుంది. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుంది. దంపతులకు ఏ విషయంలోనూ పొత్తుకుదరదు. […]
కరోనాతో ప్రపంచం అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. కరోనా నుంచి బయటపడేందుకు వేగంగా వ్యాక్సినేషన్‌ను అమలు చేస్తున్నారు. అయినప్పటికీ కేసులు కంట్రోల్ కావడంలేదు. గబ్బిలాల నుంచి ఈ వైరస్ మనుషులకు సంక్రమించి అక్కడి ప్రపంచం మొత్తానికి వ్యాపించింది. అయితే, ఇప్పుడు గబ్బిలాల నుంచి మార్‌బర్గ్ అనే మరో వైరస్ వ్యాపిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్యసంస్థ. పశ్చిమాఫ్రికాలోని గినియా దేశంలో మార్‌బర్గ్ వైరస్‌ను గుర్తించారు. ఈ వైరస్‌తో ఓ వ్యక్తి ఆగస్టు 2 వ తేదీన మరణించినట్టు ప్రపంచ ఆరోగ్యసంస్థ […]
ప్రపంచంలో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. తగ్గిందిలే అనుకుంటున్న సమయంలో తిరిగి కరోనా విజృంభిస్తుండటంతో అన్నిదేశాలు బెంబెలెత్తిపోతున్నాయి. సోమవారం రోజున యూఎస్‌లో ఏకంగా లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. వ్యాక్సిన్ వేగంగా అమలు చేస్తున్నప్పటికీ కేసులు పెరుగుతుండటం భయాందోళనలు కలిగిస్తోంది. అమెరికాలోని ఆర్కాన్సన్ రాష్ట్రంలో అత్యధిక కేసులు, ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతున్నది. సోమవారం రోజున ఆ రాష్ట్రంలో 1376 మంది ఆసుపత్రుల్లో చేరారు. ఇక అమెరికా తరువాత అత్యధిక కేసులు ఇరాన్‌లో నమోదవుతున్నాయి. సడలింపులు […]