కొంతమంది తమ ఆస్తులను పిల్లల పేరుమీద, సంస్థల పేరుమీద రాస్తుంటారు. కానీ, ఆక్కడ మాత్రం పావురాల పేరుమీద కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయట. పావురాల పేరుమీద 30 ఎకరాల భూమి, 27 షాపులు, బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో డబ్బు ఉందట. అదేంటి పావురాల పేరుమీద ఇంత మొత్తంలో ఆస్తులు ఉండటం ఎంటి? ఎవరు ఇదంతా ఎవరు చేశారు అనుకుంటున్నారా… అదే ఇప్పుడు చూద్దాం. రాజస్తాన్‌లోని నాగౌర్ పరిధిలో జస్నాగర్ అనే గ్రామం ఉన్నది. నాలుగు దశాబ్దాల కిందట సజ్జన్‌రాజ్ జైన్ అనే పారిశ్రామికవేత్త పావురాల కోసం కబుతరన్ అనే ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్ పావురాలను సంరక్షిస్తుంటుంది. మూగజీవుల కోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్ అందరికి నచ్చడంతో చాలామంది ఆ ట్రస్ట్‌కు విరాళాలు ఇవ్వడం మొదలుపెట్టారు. అలా వచ్చిన విరాళాలతో భూములు కొనుగోలు చేశారు. దుకాణాలు ఏర్పాటు చేశారు. దుకాణాలను అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చిన డబ్బులతో పావురాలను సంరక్షిస్తున్నారు. అంతేకాదు, భూమిలో గోశాలలు ఏర్పాటు చేసి 500 గోవులను రక్షిస్తున్నారు. దీంతో ఈ సంస్థలో ఉన్న పావురాలను మల్టీమిలినియర్ పావురాలుగా అక్కడి ప్రజలు చెప్పుకుంటుంటారు. ఆ గ్రామంలోని ప్రజలు కూడా పావురాలను జాగ్రత్తగా కాపాడుతుంటారు.
Read: ప్రకాశం జిల్లాలో భర్తకు గుడి కట్టిన భార్య