సముద్రంలో వింత వింత జీవులు ఎన్నో ఉంటాయి. మహాసముద్రాల్లో మనకు కనిపించే జీవుల కంటే కనిపించని జీవులు కోట్ల సంఖ్యలో ఉంటాయి. అవి అప్పుడప్పుడు అరుదుగా బయటకు వచ్చి షాక్ ఇస్తుంటాయి. ఇక డాల్ఫిన్లు మనుషులతో ఎంత మమేకం అవుతాయో చెప్పక్కర్లేదు. డాల్ఫిన్లలో తెలుపు, గ్రే కలర్ డాల్ఫిన్లు ఎక్కువగా మనకు కనిపిస్తుంటాయి. అయితే, ఇప్పుడు అత్యంత అరుదైన పింక్ డాల్పిన్‌లు సముద్రంలో కనిపించాయి. వాటిని చూసి అంతా షాకవుతున్నారు. ఇది నిజమా కాదా అని సందేహిస్తున్నారు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నంద ఈ వీడియోనే ట్వట్టర్‌లో పోస్ట్ చేయగా వేల మంది ఈ వీడియోను లైక్ చేస్తున్నారు. నిజంగా అద్భతం అని, కడలిలో కనిపించని అద్భుతాలు ఎన్నో అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Read: రైతుకు వింత కష్టం: ఆ డబ్బు వెనక్కి ఇస్తుంటే అధికారులు తీసుకోవడం లేదట…!!