దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 25,467 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో దేశంలో ఇప్పటి వరకు 3,24,74,773కేసులు నమోదవ్వగా, ఇందులో 3,17,20,112 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 3,19,551 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 354 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,35,110 కి చేరింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్నది. 24 గంటల్లో ఇండియాలో 63,85,298 మందికి టీకాలు వేశారు. దేశంలో ఇప్పటి వరకు 58,89,97,805 మందికి టీకాలు వేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
Read: మూఢాచారం: అత్త ఫిర్యాదు… నిప్పులపై నడిచిన కోడలు…