ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ప్రతిరోజూ వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 1520 కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,18,200కి చేరింది. ఇందులో 19,89,931 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్చ్ కాగా 14,922 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 10 మంది మృతి చెందారు. కృష్ణాలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, ప్రకాశంలో ఇద్దరు, […]
ఓ ఎమ్మెల్లే బీహార్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు రాజధాని ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. అలా ట్రైన్‌లోకి ఎక్కిన తరువాత ఆయన హఠాత్తుగా అండర్‌వేర్, బనియన్ వేసుకొని బోగీలో తిరుగుతూ కనిపించారు. వెంటనే తోటి ప్రయాణికులు ప్రశ్నించగా ఆయన విచిత్రమైన సమాధానం చెప్పారు. తనకు కడుపు ఉబ్బరంగా ఉందని, వాష్‌రూమ్‌కు వెళ్లి వస్తున్నానని సమాధానం చెప్పారు. ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఇలా తిరిగితే ఎలా అని ప్రయాణికులు ప్రశ్నించారు. అనంతరం ఈస్ట్ సెంట్రల్ రైల్వే సీపీఆర్‌వోకు ఫిర్యాదు చేశారు. […]
గత నెల రోజుల క్రితం చైనాను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. వెయ్యేళ్ల కాలంలో ఎప్పుడూ కూడా ఆ స్థాయిలో వర్షాలు కురవలేదని చైనా అధికారులు పేర్కొన్నారు. రోడ్లపై నడుం లోతుల్లో నీళ్లు రావడంతో పాటుగా అటు షాపింగ్ మాల్స్, సెల్లార్లు, బస్సులు, రైళ్లు అన్నీ కూడా నీటిలో సగం వరకు మునిగిపోయిన దృశ్యాలను చూశాం. ఆ పరిస్థితి నుంచి బయటపడేసరికి చైనాకు తలప్రాణం తోకకు వచ్చినంత పనైంది. కాగా, ఇప్పుడు అమెరికాను భారీ […]
ప్రపంచంలో మహమ్మారి కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. కరోనాకు చెక్ పెట్టాలి అంటే వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గం. వ్యాక్సిన్ కోసం ప్రపంచ ఆరోగ్యసంస్థ కోవాక్స్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్ ద్వారా ప్రపంచంలోకి పేద, మద్యతరగతి దేశాలకు వ్యాక్సిన్‌లను అందిస్తోంది. అయితే, కోవాక్స్‌లో భాగంగా ఉత్తర కొరియాకు 30 మిలియన్ డోసుల సీనోవ్యాక్ డోసులు అందించేందుకు కోవాక్స్ ముందుకు రాగా, దానిని ఉత్తర కొరియా తిరస్కరించింది. తమకు ఆ వ్యాక్సిన్ డోసులు […]
ఆఫ్ఘనిస్తాన్‌లోని అన్ని ప్రాంతాలను తాలిబన్లు వశం చేసుకున్నా, పంజ్‌షీర్ మాత్రం తాలిబన్లకు దక్కకుండా ఉండిపోయింది. ఎలాగైనా ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని తాలిబన్లు ప్రయత్నం చేస్తున్నారు. కానీ, తాలిబన్లకు మాత్రం ఆ అవకాశం ఇవ్వడం లేదు పంజ్‌షీర్ దళాలు. తాలిబన్లు దాడులు చేసిన ప్రతిసారి పంజ్‌షీర్ సైన్యం ఎదురుదాడి చేసి తాలిబన్లను మట్టుబెడుతున్నది. పెద్దసంఖ్యలో తాలిబన్లు పంజ్‌షీర్ చేతిలో హతం అయ్యారు. ఇక ఇదిలా ఉంటే, పంజ్‌షీర్ దళాలపై పోరాటం చేసుందుకు అల్‌ఖైదా సాయం తీసుకున్నారు తాలిబన్లు. […]
ఢిల్లీలోని అసెంబ్లీ నుంచి ఎర్రకోట వరకు ఓ సీక్రెట్ సొరంగమార్గం ఉన్నది. ఈ సొరంగ మార్గాన్ని గురువారం రోజున మరోసారి గుర్తించారు. బ్రిటీష్ కాలంలో స్వాతంత్య్ర సమరయోధులను ఈ మార్గం ద్వారా ఎర్రకోటకు తరలించేవారని, అప్పట్లో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీని కోర్టుగా వినియోగించేవారని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ పేర్కొన్నారు. 1993 లో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మొదటిసారి ఈ సొరంగమార్గం గురించి విన్నానని, అయితే, దాని చరిత్ర గురించి తెలుసుకోవాలని ఎంత […]
వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళనానికి అనేక మంది మాజీ మంత్రులు, నేతలు హాజరయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి కూడా హాజరయ్యారు. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో నిరూపించిన వ్యక్తి వైఎస్ఆర్ అని, విజయమ్మ ఆహ్వానం మేరకు తప్పకుండా వస్తానని చెప్పానని, చెప్పినట్టుగానే వచ్చానని అన్నారు. ఉదయం 7గంటలకు తాను బయలుదేరి వచ్చినట్టు తెలిపారు. ఆత్మీయ సమావేశానికి ఎందుకు వెళ్లకూడదని కాంగ్రెస్ ఆదేశాలు ఇచ్చిందో తెలియదని అన్నారు. పార్టీని అధికారంలోకి తెచ్చిన వ్యక్తి […]