ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ప్రతిరోజూ వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 1520 కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,18,200కి చేరింది. ఇందులో 19,89,931 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్చ్ కాగా 14,922 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 10 మంది మృతి చెందారు. కృష్ణాలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, ప్రకాశంలో ఇద్దరు, నెల్లూరులో ఒకరు మృతి చెందినట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. చిత్తూరులో 188, తూర్పు గోదావరి జిల్లాలో 263, గుంటూరులో 162, కృష్ణాజిల్లాలో 159, నెల్లూరులో 186, ప్రకాశంలో 123, పశ్చిమ గోదావరి జిల్లాలో 171 కేసులు నమోదయ్యాయి.
Read: ట్రైన్‌లో అండర్‌వేర్‌తో అధికారపార్టీ ఎమ్మెల్యే… అవాక్కైన ప్రయాణికులు…