NTV WebDesk
Author- NTV Telugu-
టీకా తీసుకుంటే ఆ వేరియంట్ల నుంచి రక్షణ…
కరోనా మహమ్మారి నుంచి బయటపడాలి అంటే టీకాలు తీసుకొవడం ఒక్కటే మార్గం కావడంతో వేగంగా టీకాలు అమలు చేస్తున్నారు. టీకాలు తీసుకున్నాక శరీరంలో యాంటీబాడీలు వృద్ధి చెందుతాయి. ఈ యాంటీబాడీలు కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి. టీకాలు తీసుకున్నాక చాలా మందికి కరోనా సోకుతున్నది. అలాంటి కేసులను బ్రేక్‌త్రూ కేసులుగా పేర్కొంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి కేసులు అధికంగా నమోదవుతుండటంతో అసలు వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా అన్నది సందేహంగా మారింది. 16 రకాల వేరియంట్లపై వ్యాక్సిన్ సమర్థవంతంగా […] -
ఇండియా కరోనా అప్డేట్: స్వల్పంగా పెరిగిన కేసులు…
ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. నిన్న రిలీజ్ చేసిన బులిటెన్ ప్రకారం 14 వేల కేసులు నమోదవ్వగా ఆ కేసులు ఇప్పుడు 15 వేలకు పైగా నమోదయ్యాయి. తాజాగా ఇండియాలో 15,823 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,40,01,743కి చేరింది. ఇందులో 3,33,42,901 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 2,07,653 కేసులు ప్రస్తుతం యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో […] -
హుజురాబాద్‌కు అమిత్‌షా…?
హుజురాబాద్‌కు ఈనెల 30 వ తేదీన ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఉప ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ పూర్తిస్థాయిలో ప్రచారం చేస్తున్నది. హరీష్‌రావు అన్నీ తానై ప్రచారం చేస్తున్నారు. త్వరలోనే కేసీఆర్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది. అయితే, ఇటు బీజేపీ కూడా పోటీ పోటీగా ప్రచారం చేస్తున్నది. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు. ప్రస్తుతానికి లోకల్లో బీజేపీ నాయకులు ప్రచారం […] -
మణిపూర్‌లో ఉగ్రవాదుల కాల్పులు… ఐదుగురు మరణం…
దేశంలో మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. జమ్మూకాశ్మీర్‌లో గత కొన్ని రోజులుగా ఉగ్రవాదులు పంజా విసురుతున్నారు. గతంలో సైనికులను టార్గెట్ చేసుకొని దాడులు జరిపే ఉగ్రవాదులు, ఇప్పుడు రాష్ట్రంలోని పౌరులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా మైనారీటీలైన కాశ్మీరీ పండిట్లపై దాడులు పెరిగిపోతున్నాయి. ఇక ఉదిలా ఉంటే, ఇప్పుడు మణిపూర్‌లోనూ ఉగ్రవాదులు మారణహోమం సృష్టిస్తున్నారు. మణిపూర్‌లోని కాంగ్‌పోక్సీ జిల్లాలోని బి గామ్నోవ్‌లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు అమాయక పౌరులు మృతి చెందారు. దీంతో […] -
హుజురాబాద్: నామినేషన్ల ఉపసంహరణకు నేడు చివరి రోజు… పెరుగుతున్న ఉత్కంఠత
హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగియనున్నది. ఈరోజు సాయంత్రం గుర్తులను కేటాయించనున్నారు. ప్రస్తుతానికి బరిలో 42 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇందులో ఎంతమంది నామినేషన్లను ఉపసంహరించుకుంటారు అన్నది తెలియాల్సి ఉన్నది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఉపసంహరణకు సమయం ఉన్నది. పోటీనుంచి తప్పుకునే వారు నేరుగా సంతకం పెట్టి నామినేషన్‌ను వెనక్కి తీసుకోవాలి. అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నుంచి ముగ్గురు, 32 మంది […] -
యూనిసెఫ్ ఆందోళన: ఇప్పుడు ఆదుకోకుంటే… భవిష్యత్ తరాలకు పెనుదెబ్బ…
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్ల ఆక్రమణ తరువాత ఆ దేశంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తాలిబన్లను చూసుకొని ఇతర ఉగ్రవాద సంస్థలు రెచ్చిపోతున్నాయి. రష్యా, పాక్, చైనా మినహా మిగతా దేశాలు తమ రాయబార కార్యాలయాలను మూసేసిన సంగతి తెలిసిందే. తాలిబన్ ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు గుర్తించకపోవడంతో ఆ దేశం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నిత్యవసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో పేదలకు సరైన ఆహారం దొరకడం లేదు. ఈ సమస్య నుంచి ఆఫ్ఘనిస్తాన్ బయటపడాలి అంటే […] -
ఆంక్షలు ఎత్తివేత: అక్టోబర్ 18 నుంచి పూర్తిస్థాయిలో విమానాలు…
కరోనా కారణంగా విమానాలపై పలు ఆంక్షలు విధించని సంగతి తెలిసిందే. కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో ఆంక్షలను ఒక్కొక్కటిగా సడలిస్తూ విమానాలను నడుపుతున్నారు. కాగా, అక్టోబర్ 18 వ తేదీనుంచి పూర్తి స్థాయి సీటింగ్‌తో విమానాలను నడిపేందుకు పౌరవిమానాయ మంత్రిత్వ శాఖ అనుమతులు మంజూరు చేసింది. కరోనా అదుపులోకి వస్తున్న నేపథ్యంలో పరిమితిపై ఉన్న ఆంక్షలను తొలగించింది. మే 25, 2020 న 33 శాతం సీటింగ్‌తో దేశీయ విమానాలకు అనుమతులు ఇవ్వగా, ఆ తరువాత క్రమంగా […] -
వినియోగదారులకు షాకిచ్చిన పుత్తడి…
గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఒక్కసారిగా మళ్లీ పెరిగాయి. పండుగ సీజన్ కావడంతో బంగారం కొనుగోలు చేసేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతుంటారు. ఈ సమయంలో బంగారం ధరలు పెరగడం కొంత ఇబ్బందులు తీసుకొచ్చే అంశంగా చెప్పుకోవాలి. పెరిగిన ధరల ప్రకారం ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 పెరిగి రూ.44,150కి చేరింది. 10 గ్రామలు 24 క్యారెట్ల బంగారం […] -
అక్టోబర్ 13, బుధవారం దినఫలాలు…
మేషం:- వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి. అరుదైన శస్త్రచికిత్సలను డాక్టర్లు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచనస్ఫురిస్తుంది. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు ఆందోళన కలిగిస్తుంది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. వృషభం:- శారీరక శ్రమ, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. తల పెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహనం ఎదుర్కొటారు. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ప్రియతములతో ప్రయాణాల్లో ఊహించని చిక్కులు ఎదురయ్యే అవకాశ ఉంది. ఏ […] -
బీజేపీ ఎదురుదాడి: ఆ రాష్ట్రాల విషయంలో కాంగ్రెస్ మౌనం…
లఖింపూర్ ఘటన తరువాత కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. రైతుల విషయంలో, దళితుల విషయంలో బీజేపీ అరాచకాలు సృష్టిస్తోందని, బీజేపీ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు యూపీలోని లఖింపూర్ బాధితులను పరామర్శించిన తరువాత యూపీలో పెద్ద ఎత్తున సభలు ఏర్పాటు చేసి విమర్శలు చేయడం మొదలుపెట్టారు. దీనిపై బీజేపీ నేత ఎదురుదాడి మొదలుపెట్టారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, మహారాష్ట్రతో […]
తాజావార్తలు
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్‌ను తలపించేలా కొత్త లుక్
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
-
Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
-
XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
-
Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!