వినాయక చవితి అంటే మనకు హైదరాబాద్ గుర్తుకు వస్తుంది. హైదరాబాద్‌లో వేలాది మండపాల్లో వినాయకులు కొలువుదీరుతారు. అన్నింటికంటే స్పెషల్ ఎట్రాక్షన్‌గా కనిపించే వినాయకుడు మాత్రం ఖైరతాబాద్ వినాయకుడే అని చెప్పాలి. ఎందుకంటే, ప్రతి ఏడాది అడుగుచొప్పున పెంచుకుంటూ ఒక్కో ఏడాది ఒక్కో అవతారంలో గణపయ్య దర్శనం ఇస్తుంటారు. గతేడాది కరోనా కాలంలో కూడా మహాగణపతిని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 10 వ తేదీన వినాయక చవితి కావడంతో […]
తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్నాక తొలిసారిగా ప్రభుత్వ అధినేత ముల్లా అబ్దుల్ బరాదర్‌ను కలిశారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంలో ఐఎస్ఐ కీలక పాత్ర పోషించబోతున్నట్టుగా వస్తున్న వార్తలపై తాలిబన్ అధికార ప్రతినిధులు స్పందించారు. ముల్లా బరాదర్‌ను పాక్ ఐఎస్ఐ చీఫ్ కలిసిన మాట వాస్తవమే అని, ఇరు దేశాల మద్య ద్వైపాక్షి సంబందాలు మెరుగుపరుచుకోవడం కోసమే ఆయన ముల్లా బరాదర్‌ను కలిశారని, ఆఫ్ఘన్ అంతర్గత వ్యవహారాల విషయంలో మరో దేశం జోక్యం అవసరం లేదని తాలిబన్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. […]
ఉత్తరప్రదేశ్‌లో 1991లో ఈపీసీఈ అనే ఆసుపత్రిని నిర్మించారు. అందులో రోగుల కోసం లిప్ట్‌ను ఏర్పాటు చేశారు. అయితే, 1997 వరకు వినియోగించిన లిఫ్ట్‌ను కొన్ని కారణాల వలన వినియోగించకుండా వదిలేశారు. ఆ తరువాత దాని గురించి ఎవరూ పట్టించుకోలేదు. అయితే, తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు ఇటీవలే అధికారులు ఈ లిఫ్ట్‌ను ఓపెన్ చేయగా అందులో షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. లిఫ్ట్‌లో ఓ మనిషికి సంబందించిన అస్తిపంజరం కనిపిచింది. దానిని చూసిన అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. […]
మేషం : ఆర్థికంగా పురోభివృద్ధి సాధించే యత్నాలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు ఓర్పు, పట్టుదలతో శ్రమించినగాని పూర్తికావు. ఉమ్మడి వ్యాపారాలు, లీజు, ఏజెన్సీల వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో మెళకువ వహించండి. బంధు మిత్రుల రాకపోకల వల్ల గృహంలో సందడి వాతావరణం నెలకొంది. వృషభం : దైవ, పుణ్యకార్యాలలో ఇతోధికంగా వ్యవహరిస్తారు. స్త్రీలకు వస్త్రములు, అకలంకరణలు, విలాస వస్తువుల పట్ల ఆకర్షణ పెరుగుతుంది. కొంతమంది మీ నుంచి విషయాలు రాబట్టడానికి యత్నిస్తారు. తొందరపడి వాగ్దానాలు చేసి సమస్యలకు గురికాకండి. […]
గత ఏడాదిన్నర కాలం నుంచి ప్రపంచాన్ని కరోనా అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నది. కొన్ని దేశాలు కరోనా నుంచి బయటపడి తిరిగి అభివృద్ధి వైపు అడుగులు వేస్తుండగా, కొన్ని దేశాలు తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. అనేక దేశాల్లో కరోనా నుంచి ఇంకా కోలుకోలేదు. పర్యాటకంపై ఆధారపడే దేశాల్లో కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇలా సంక్షోభంలో కూరుకుపోయిన దేశాల్లో శ్రీలంక కూడా ఒకటి. శ్రీలంక పర్యాటకంపై ఆధారపడిన దేశం కావడంతో ఆ దేశం అన్ని రకాలుగా ఇబ్బందులు […]
భూమిపై కాకుండా ఇతర గ్రహాల్లో ఆవాసయోగ్యవంతమైన గ్రహాల కోసం నాసా చాలా కాలంగా అన్వేషణ సాగిస్తున్నది. ఈ అన్వేషణలో భాగంగా జూపిటర్ గ్రహానికి ఉన్న ఉపగ్రహాలపై పరిశోధన చేస్తున్నది. జూపిటర్ గ్రహానికి ఉన్న ఉపగ్రహాల్లో గనీమేడ్ అనే ఉపగ్రహం ఉన్నది. ఈ ఉపగ్రహం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గనీమేడ్ ఉపగ్రహంలో నీటి జాడను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ నీరు తాగడానికి పనికి వస్తుందా లేదా అనే విషయాలపై ఇంకా పరిశోధనలు జరపాల్సి ఉన్నది. గనీమేడ్‌పై భాగం […]
అది అందమైన దీవి. ఇటలీలోని వెనీస్ నగరానికి కూతవేటు దూరంలో ఓ చిన్న దీవి ఉంది. ఈ దీవిపేరు పోవెగ్లియా. దీనికి అర్ధం సుందరమైన దీవి అని. కానీ, ఇటలీ ప్రజలు మాత్రం ఈ దీవిని దెయ్యాల దిబ్బగా పిలుస్తారు. ప్రజలు నివాసానికి అనుకూలంగా ఉన్నప్పటికీ, అక్కడ దీవిలోకి అడుగుపెట్టాలంటే గుండెలు జారిపోతాయి. అడుగడుగున భయంతో వణికిపోతారు. దీని వెనుక చాలా పెద్ద కారణం ఉన్నది. 16 వ శతాబ్దంలో ఇటలీలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. ఈ […]
ప్రపంచంలోని చాలా దేశాల్లో ప్రజాస్వామ్యం అమలులో ఉన్నది. అయితే, కొన్ని దేశాల్లో మాత్రం నియతృత్వ పాలన, సైనిక పాలన, ఉగ్రవాద పాలన సాగుతున్నది. అస్థిరతకు మారుపేరుగా చెప్పుకునే ఆఫ్రికాలోని అనేక దేశాల్లో స్థానిక ప్రభుత్వాలకు, ఉగ్రవాదులకు మధ్య తీవ్రమైన పోరు జరుగుతున్నది. సహజవనరులు ఉన్నప్పటికీ వాటిపై ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరులో సామాన్యప్రజలు సమిధులౌవుతున్నారు. ఆఫ్రికాలోని బుర్కినోఫాసో, ఉగాండా, రువాండా, నైజీరియా, కాంగో, సోమాలియా తదితర దేశాల్లో ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఎప్పుడు ఏ […]
దేశంలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. వర్షాలు బీహార్ రాష్ట్రాన్ని ముంచెత్తాయి. దీంతో సామాన్యప్రజలతో పాటుగా విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా గత విద్యాసంవత్సంలో పాఠశాలలు జరగలేదు. గత నెల రోజుల నుంచి పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. స్కూళ్లు ప్రారంభమైన కొన్ని రోజులకే వరదలు ముంచెత్తడంతో ఉపాద్యాయులు పడవల్లోనే పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. కతియార్ జిల్లాలోని మహనీహరి ప్రాంతంలో ఉపాద్యాయులు పడవల్లోనే విద్యను బోధిస్తున్నారు. […]
ఏ వయసులోనైనా తోడు లేకుండా జీవించడం చాలా కష్టం. అందుకే తొలి వయసులో కంటే మలి వయసులో తోడు కోరుకుంటారు. మొదటి నుంచి తన కష్టాన్ని నమ్ముకొని చిన్నవ్యాపారం చేస్తు తన ఐదురుగు కుమార్తెలకు పెళ్లిల్లు చేసిన షఫీ అహ్మద్ అనే 90 ఏళ్ల పెద్దాయనకు పెళ్లి చేయాలని అనుకున్నారు కుమార్తెలు. అనుకున్నదే తడవుగా 75 ఏళ్ల అయేషా అనే మహిళతో వివాహం జరిపించారు. కుమార్తెలకు పెళ్లిళ్లు కావడంతో వారి వారంతా అత్తగారింటికి వెళ్లిపోయారు. చాలా కాలం […]