తాలిబన్లు కలక ప్రకటన చేశారు. పంజ్‌షీర్‌ను కైవసం చేసుకున్నట్టుగా ప్రకటించారు. పంజ్‌షీర్ కైవసంతో ఆఫ్ఘనిస్తాన్ మొత్తం తాలిబన్ల కైవసం అయింది. ఇక అమ్రుల్లా సలేహ్ ఇంటిని తాలిబన్లు డ్రోన్లతో పేల్చివేశారు. పంజ్‌షీర్ రాజధానిలోని గవర్నర్ కార్యాలయంపై తాలిబన్లు తెలుపు జెండాను ఎగరవేశారు. ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంతంపై పట్టు సాధించేందుకు తాలిబన్లు తీవ్ర ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పోరులో తాలిబన్లు పూర్వమిత్రులైన అల్‌ఖైదా సహాయం తీసుకోవడంతో విజయం సాధించినట్టు సమాచారం. మరో రెండు మూడు […]
ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్లు కైవసం చేసుకోవడంతో అక్కడ అంతర్యుద్ధం జరుగుతున్నది. పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఆ దేశాధ్యక్షుడు దేశం వదిలి పారిపోయాడు. ఇక ఇదిలా ఉంటే, ఆఫ్రికాలోని గినియాలోనూ సైనికుల తిరుగుబాటు జరిగింది. దేశాన్ని సైనికులు వారి చేతిల్లోకి తీసుకున్నారు. గినియా అధ్యక్షుడు అల్ఫా కోంటేని సైనికులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేసినట్టు సైనికులు ప్రకటించారు. దేశంలో ప్రజారంజకమైన పాలన సాగిస్తామని ఆ దేశ ఆర్మీ కల్నల్ మామాడి డౌంబౌయా తెలిపారు. ఈరోజు […]
ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. డెల్టాతో పాటుగా డెల్టాప్లస్, ఏవై 11, ఏవై 12, ఏవై 13 వేరియంట్లు ఇండియాలో విస్తరిస్తున్నాయి. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 38,948 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,30,27,621కి చేరింది. ఇందులో 3,21,81,995 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా… 4,04,874 కేసులు […]
మహిళలకు కురులు ఎంతో అందాన్ని ఇస్తాయి. కురుల సంరక్షణ కోసం వేలాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు. జుట్టు అందాన్ని ఇవ్వడమే కాకుండా వారిలో ఒక కాన్ఫిడెంట్‌ను పెంచుతాయి కూడా. ఓ మహిళ స్విమ్మింగ్ పూలోకి జంప్ చేసేందుకు సిద్ధం కాగా, అక్కడ ఉన్న అందరూ ఆమెను ఎంకరేజ్ చేశారు. దీంతో ఆ మహిళ మరింత ఉత్సాహంతో దాల్లో పల్టీలు కొడుతూ స్విమ్మింగ్‌పూల్‌లోకి దూకింది. పల్టీలు కొట్టే సమయంలో మహిళ తలకు ఉన్న విగ్గు ఊడి స్టాండ్‌పై పడింది. […]
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. ఈ కాల్పుల్లో 11 మంది మృతి చెందినట్టు పోలీసులు చెబుతున్నారు. శని, ఆదివారాల్లో అమెరికాలోని వాషింగ్టన్, ఫ్లోరిడా, హ్యూస్టన్ సిటిలో కాల్పులు జరిగాయి. ఫ్లోరిడాలో ఓ సైకో జరిపిన కాల్పుల్లో నలుగురు, హ్యూస్టన్ లో నలుగురు, వాషింగ్టన్‌లో ముగ్గురు మృతి చెందారు. విచ్చలవిడిగా గన్ కల్చర్ పెరిగిపోవడమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. గత కొంతకాలంగా అమెరికాలో గన్‌కలచ్చర్ పెరిగిపోతున్నది. కరోనా కాలంలో ఈ గన్ కల్చర్ మరింతగా పెరిగింది. […]
ఆఫ్ఘనిస్తాన్‌లో అంతర్యుద్ధం జరుగుతున్నది. ఎలాగైనా పంజ్‌షీర్ ప్రావిన్స్‌ను అక్రమించుకోవాలని తాలిబన్లు చూస్తున్నారు. తాలిబన్లకు పంజ్‌షీర్ మాత్రమే కాకుండా, వారి చెర నుంచి ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్ని విడిపించాలని పంజ్‌షీర్ దళం పోరాటం చేస్తున్నది. పంజ్‌షీర్ ప్రావిన్స్‌లో మొత్తం 8 జిల్లాలు ఉన్నాయి. ఈ ఎనిమిది జిల్లాలలో పెద్ద ఎత్తున తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్నది. అయితే, తాము పంజ్‌షీర్‌లోని 4 జిల్లాలను ఆక్రమించుకున్నామని, పంజ్‌షీర్ రాజధాని బజారక్ లోని గవర్నర్ కార్యాలయంలోకి కూడా ప్రవేశించామని తాలిబన్లు చెబుతుంటే, పంజ్‌షీర్ […]
దేశంలో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ 40 వేలకు పైగా నమోదవుతున్నాయి. డెల్టాతో పాటుగా డెల్టా ప్లస్ కేసులు కూడా పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. డెల్టా ప్లస్ వేరియంట్ నుంచి మరో కొత్త వేరియంట్ పుట్టుకు వచ్చింది. అదే ఏవై 12 వేరియంట్. దేశంలో ఈ ఏవై 12 వేరియంట్‌లు ఆగస్టు 30 వ తేదీన దేశంలో మొదటిసారి గుర్తించారు. ఉత్తరాఖండ్‌లో మొదట వెలుగుచూసిన ఈ వేరియంట్ ఇప్పుడు […]
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక అక్కడి పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఆగస్టు 15 వ తేదీన తాలిబన్లు కాబూల్‌ను ఆక్రమించుకున్నారు. తాలిబన్లు కాబూల్ ను ఎలా ఆక్రమించుకున్నారు అనే విషయంపై ఆ దేశ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ కీలక సమాచారం అందించారు. ఆగస్టు 15 వ తేదీన పోలీస్ చీఫ్ తనకు ఫోన్ చేశారని, జైల్లో యుద్ధఖైదీలు తిరుగుబాటు చేస్తున్నారని, అణిచివేతకు సహాయం కావాలని కోరారని, అయితే, రక్షణ మంత్రి, హోమ్ మంత్రికి ఫోన్ చేసినా లాభం లేకపోయిందని, […]
మేషం : స్థిరాస్తుల అమ్మకానికై చేయుయత్నాలు వాయిదాపడటం మంచిది. ఉపాధ్యాయులతో మితంగా సంభాషించండి. రుణవాయిదాలు, పన్నులు సకాలంలో చెల్లిస్తారు. స్త్రీలకు అనురాగ, వాత్సల్యాలు పెంపొందుతాయి. ముఖ్యంగా, ఇతరుల వ్యాపార విషయాలలో జోక్యం అంత మంచిదికాదు అని గమనించండి. వృషభం : బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. అతిథి మర్యాదలు, సత్కారాలు సమర్థంగా నిర్వహిస్తారు. ఉద్యోగస్తులకు స్థానచలన యత్నాల్లో పురోభివృద్ధి. మీ నిజాయితీకి మంచి గుర్తింపు, రాణింపు, ప్రశంసలు లభిస్తాయి. స్త్రీలకు వస్తువుల పట్ల […]
దేశంలో ఈ ఏడాది కాలంలో పెట్రోల్ ధరలు రూ.20 మేర పెరిగాయి. దీంతో సామాన్యులు అవస్థలు పడుతున్నారు. పెట్రోల్, డీజిల్ తోపాటుగా వంటగ్యాస్ ధరలు కూడా భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.200 వరకు గ్యాస్ ధరలు పెరిగాయి. అయితే, దేశంలో పెట్రోల్ ధరలు పెరగడానికి కారణం ఆఫ్ఘనిస్తాన్‌లో అంతర్యుద్ధమే అని, తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను అక్రమించుకోవడంతో ధరలు పెరిగాయని చెప్పుకొచ్చారు కర్ణాటక ఎమ్మెల్యే. హుబ్లీ -ధార్వాడ్ పశ్చిమ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ పెట్రోల్ ధరల పెరుగుదలపై […]