తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్నాక తొలిసారిగా ప్రభుత్వ అధినేత ముల్లా అబ్దుల్ బరాదర్‌ను కలిశారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంలో ఐఎస్ఐ కీలక పాత్ర పోషించబోతున్నట్టుగా వస్తున్న వార్తలపై తాలిబన్ అధికార ప్రతినిధులు స్పందించారు. ముల్లా బరాదర్‌ను పాక్ ఐఎస్ఐ చీఫ్ కలిసిన మాట వాస్తవమే అని, ఇరు దేశాల మద్య ద్వైపాక్షి సంబందాలు మెరుగుపరుచుకోవడం కోసమే ఆయన ముల్లా బరాదర్‌ను కలిశారని, ఆఫ్ఘన్ అంతర్గత వ్యవహారాల విషయంలో మరో దేశం జోక్యం అవసరం లేదని తాలిబన్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. పాక్‌తో సహా ఏ దేశం కూడా తమ దేశం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు అనుమతించబోమని అన్నారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందేందుకు తాలిబన్లు సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Read: దారుణం: 24 ఏళ్ల తరువాత ఆ లిఫ్ట్‌ను తెరిచి చూస్తే…