1912 వ సంవత్సరంలో టైటానిక్ షిప్ ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. అప్పట్లో టైటానిక్ ఒక లగ్జరీ షిప్‌గా పేరుగాంచింది. ఈ షిప్ సముద్రంలోని ఐస్‌బర్గ్‌ను ఢీకొని మునిగిపోయింది. అందులో ప్రయాణం చేస్తున్న వందలాది మంది జలసమాధి అయ్యారు. ఎన్నో ఏళ్ల తరువాత ఆ షిప్‌ను పరిశోధకులు సముద్రంలో గుర్తించారు. ఆ షిప్ ఆధారం చేసుకొని టైటానిక్ సినిమా వచ్చింది. టైటానిక్ షిప్ మునిగిపోయి వందేళ్లకుపైగా అయింది. సముద్రం అడుగున ఉన్న ఆ షిప్ ఇప్పటికు చాలా వరకు నశించిపోయింది. ఇనుమును తినే కొన్నిరకాల బ్యాక్టీరియాలు చాలా వరకు టైటానిక్ షిప్‌ను తినేశాయి. మరో 12 ఏళ్లతో అట్లాంటిక్ మహాసముద్రంలో 4000 మీటర్ల లోతులో ఉన్న టైటానిక్ షిప్ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉన్నట్టుగా పరిశోధకులు చెబుతున్నారు.
Read: విమానంలో చీమలు…హాలీవుడ్ సినిమాను తలపించిన సీన్…