వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల కోసం అన్ని పార్టీలు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని సంస్థలు ఎన్నికలకు సంబందించి ముందస్తు సర్వేలు ఫలితాలు విడుదల చేశాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ మరోసారి విజయం సాధిస్తుందని, మళ్లీ సీఎంగా యోగీని ఎంచుకునే అవకాశం ఉందని ముందస్తు సర్వేలు పేర్కొన్నాయి. ఇక ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో యూపీనుంచి ఎంఐఎం కూడా బరిలోకి దిగుతున్నది. చారిత్రక నగరమైన అయోధ్య నుంచి ఎంఐఎం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నట్టు యూపీ ఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడు పేర్కొన్నారు. అయోధ్యనగరానికి 57 కిలోమీటర్ల దూరంలో ఉన్న రుదౌలీ తహసీల్ లో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రచారం ప్రారంభించబోతున్నారు. ఈ ప్రచారాన్ని ఎంఐఎం చీఫ్ అసదుద్ధీన్ ఒవైసీ ప్రారంభించనున్నారు.
Read: సిరిసిల్లను ముంచెత్తిన వానలు…చెరువులను తలపిస్తున్న రోడ్లు…