కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్లు అందిస్తున్నారు. ప్రపంచంలో అనేక రకాల కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. వాటి తయారినీ బట్టి కరోనా వైరస్ ను అడ్డుకునే సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. కొన్ని వ్యాక్సిన్లు మూడు నెలల పాటు కరోనా మహమ్మారికి అడ్డుకోగలిగితే మరికొన్ని ఆరు నెలల వరకు వైరస్‌ను అడ్డుకోగలుగుతాయి. అమెరికాకు చెందిన మోడెర్నా సంస్థ తయారు చేసిన మోడెర్నా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఆరు నెలల వరకు యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని, బలమైన రోగనిరోధకత ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 70 ఏళ్ల వయసు కలిగిన వారితో పాటుగా అన్ని వయసుల వారిపై ఇప్పటికే ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించగా, అందరిపైనా ఈ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు పరిశోధనలో తేలింది. మోడెర్నా తీసుకున్న వారికి బూస్టర్ డోస్ అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.
Read: గుజరాత్ రాజకీయం: స్పీకర్ రాజీనామా… వెంటనే అమల్లోకి…