ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికలకు సంబందించిన పూర్తి ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలు అధికార వైసీపీకి అనుకూలంగా ఉండటం విశేషం. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ దూసుకుపోయింది. భారీ విజయాలు నమోదు చేసుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా 7,219 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా అధికార వైసీపీ 5998 చోట్ల విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ 826 చోట్ల, జనసేన 177 చోట్ల, బీజేపీ 28, సీపీఎం15, సీపీఐ 8, ఇతరులు 157 స్థానాల్లో విజయం సాధించారు. ఇండిపెండెంట్లు ఎక్కువ స్థానాలు […]
అమెరికాలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మరలా పెరుగుతున్నాయి. కేసులతో పాటుగా గత వారం రోజుల నుంచి మరణాల సంఖ్యకూడా భారీగా పెరుగుతున్నది. ప్రతిరోజూ 2 వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. కోవిడ్‌తో శుక్రవారం రోజున అత్యధికంగా 2,579 మరణాలు సంభవించాయి. సగటున ప్రతిరోజూ 2,012 మరణాలు సంభవిస్తున్నాయని న్యూయార్క్ టైమ్స్ పేర్కొన్నది. దేశంలోని ఫ్లోరిడా, టెక్సాస్, క్యాలిఫోర్నియా రాష్ట్రాల్లో అత్యధికంగా మరణాలు, కేసులు నమోదవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా డెల్టా వేరియంట్ […]
హైదరాబాద్‌లో ప్రస్తుతం గణేశ్ నిమజ్జన కార్యక్రమం జరుగుతున్నది. నిన్న మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం తరువాత వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న గణపతుల విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తున్నారు. పెద్ద ఎత్తున నిమజ్జన కార్యక్రమం జరుగుతున్నది. ఇక నిన్నటి రోజున బాలాపూర్ లడ్డూ వేలం రికార్డుస్థాయిలో రూ.18.90 లక్షలకు అమ్ముడు పోయింది. అయిదే, బాలాపూర్‌తో పాటుగా నగరంలో అనేక మండపాల్లో వినాకుల లడ్డూలను వేలం వేశారు. ఎక్కడెక్కడ ఎంతెంతకు వేలం జరిగిందో […]
పంజాబ్ సీఎంగా చరణ్‌జిత్ చన్నీని నియమిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం పంజాబ్ సీఎంగా సుఖ్‌సిందర్ సింగ్ రణ్‌ధవా ను ఎంపిక చేసినట్టుగా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం రణ్‌ధవా పంజాబ్ కేబినెట్ మంత్రిగా పనిచేస్తునన్నారు. ఆయన నియామకం దాదాపుగా ఖరారైందని, అధికారికంగా ప్రకటించడమే తరువాయి అనుకుంటున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ మరో ట్విస్ట్ ఇచ్చింది. పంజాబ్ సీఎంగా చరణ్‌జిత్ సన్నీని ఎంపిక చేసినట్టుగా పంజాబ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రావత్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. కరోనా కేసులు తగ్గినట్టుగా తగ్గి తిరిగి పెరుగుతున్నాయి. తాజాగా ఏపీలో 1337 కరోనా కేసులు నమోదైనట్టు ఏపీ ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,38,690కి చేరింది. ఇందులో 20,09,921 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 14,699 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి […]
పంజాబ్ కాంగ్రెస్ కొత్త ముఖ్యమంత్రిగా సుఖ్‌జిందర్ సింగ్ రణ్‌దవాను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన తరువాత సిద్ధూపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. సిద్దూకి, పాక్ పీఎం, ఆర్మీ చీఫ్‌కి మద్య మంచి సంబంధాలు ఉన్నాయని, పాక్ కు పంజాబ్ ఆయుధంగా మారుతుందేమో అనే భయం కలుగుతుందని, సిద్ధూ సీఎంగా ఎంపికైతే పంజాబ్‌లోకి పాక్ ఆయుధాలు వస్తాయని తద్వారా దేశంలో కలహాలు రేగే అవకాశం ఉందని అమరీందర్ సింగ్ […]
కరోనా కారణంగా ఎక్కడ వ్యక్తులు అక్కడే ఆగిపోయారు. కరోనా మహామ్మారి కారణంగా పర్యాటకంగా అభివృద్ధి చెందిన దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. నిత్యం పర్యాటకులతో కలకలలాడే థాయ్‌ల్యాండ్ ఇప్పుడు బోసిపోయింది. కరోనా కారణంగా ఆ దేశానికి వచ్చేందుకు పర్యాటకులు ఆలోచిస్తున్నారు. రోడ్లపై నిత్యం పరుగులు తీసే క్యాబ్‌లు షెడ్డుకే పరిమితం అయ్యాయి. షెడ్డుకే పరిమితమైన క్యాబ్‌లపై గార్డెన్ ను పెంచాలని క్యాబ్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. క్యాబ్‌లపై వెదురుకర్రలతో ఒక చిన్న తొట్టిలాగా ఏర్పాటు చేసి అందులో మట్టి […]
పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా సుఖ్‌జిందర్ సింగ్ రన్‌ధవాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. అమరీందర్ సింగ్ రాజీనామా తరువాత పంజాబ్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. నిన్నటి రోజున మాజీ పీసీసీ అధ్యక్షుడు సునీల్ పేరు తెరమీదకు వచ్చింది. ఆ తరువాత అంబికాసోనీ పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పరశీలించింది. అనేకమంది పేర్లను పరిశీలించిన అధిష్టానం సుఖ్‌జిందర్ సింగ్ రన్‌ధవాను ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రకటనను కూడా విడుదల చేసింది. కాగా, కాసేపట్లో కాంగ్రెస్ […]
ఆమెరికాపై పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పాక్ నిందలు వేస్తున్నదని ఆరోపించారు. 2001లో అమెరికా దళాలు ఆఫ్ఘనిస్తాన్‌పై దాడులు చేసిన సమయంలో పాకిస్తాన్‌లో రాజకీయ సుస్థిరత లేదని, జనరల్ పర్వేజ్ ముషారఫ్ తిరుగుబాటు చేసి పాలన చేజిక్కించుకున్నారని, ముషారఫ్‌కు అమెరికా మద్ధతు అవసరమవడంతో ఆఫ్ఘన్‌లో యుద్ధానికి మద్ధతు పలికారని, ఇది తప్పుడు నిర్ణయం అని పాక్ పీఎం పేర్కొన్నారు. అయితే, విదేశీదళాలకు వ్యతిరేకంగా వారికి శిక్షణ ఇచ్చామని, అమెరికాకు వ్యతిరేకంగా […]
పంజాబ్ రాజకీయాలు రంగులు మారుతున్నాయి. అమరీందర్ సింగ్ రాజీనామా తరువాత ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అప్పగించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ పంజాబ్ సీఎంగా బాధ్యతలు చేపట్టాలని ఆ పార్టీ సీనియర్ నేత అంబికా సోనీకి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. అయితే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆఫర్‌ను అంబికాసోనీ తిరస్కరించారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా సిక్కు వర్గానికి చెందిన వ్యక్తిని నియమిస్తేనే బాగుంటుందని, వచ్చే ఎన్నికల్లో సిక్కు వర్గంనుంచి వ్యతిరేకత రాకుండా ఉండాలి అంటే […]