పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా సుఖ్‌జిందర్ సింగ్ రన్‌ధవాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. అమరీందర్ సింగ్ రాజీనామా తరువాత పంజాబ్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. నిన్నటి రోజున మాజీ పీసీసీ అధ్యక్షుడు సునీల్ పేరు తెరమీదకు వచ్చింది. ఆ తరువాత అంబికాసోనీ పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పరశీలించింది. అనేకమంది పేర్లను పరిశీలించిన అధిష్టానం సుఖ్‌జిందర్ సింగ్ రన్‌ధవాను ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రకటనను కూడా విడుదల చేసింది. కాగా, కాసేపట్లో కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం అయ్యి రన్‌ధవాను తమ నాయకుడిగా ఎన్నుకోనున్నారు. మంత్రులు కూడా నిన్నటి రోజున రాజీనామా చేయడంతో కొత్త మంత్రివర్గంపై అప్పుడే కసరత్తులు మొదలయ్యాయి. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అమరీందర్ సింగ్ కొనసాగుతారా లేదంటే పార్టీ నుంచి పక్కకు తప్పుకొని భవిష్యత్ కార్యాచరణపై దృష్టిపెడతారా అన్నది చూడాలి.
Read: అమెరికాపై పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు… వారికి మద్ధతు ఇచ్చి తప్పుచేశాం…