ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఓ మూడు అడుగుల విష సర్పం ఒకటి బరబరామని వచ్చి పార్కింగ్ చేసిన స్కాటీలోకి దూరింది. అలా స్కూటీలోకి దూరిన ఆ పామును బయటకు రప్పించేందుకు అక్కడ ఉన్న జనం శతవిధాలా ప్రయత్నం చేశారు. పామును బయటకు రప్పించేందుకు నీళ్లు కూడా పోశారు. అయినప్పటికి ఆ పాము బయటకు రాలేదు. ఎంత ప్రయత్నించినా పాము బయటకు రాకపోడంతో రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందించారు. వెంటనే వచ్చిన స్నేక్ రెస్క్యూ టీమ్ రెండు గంటలకు పైగా శ్రమించి స్కూటి ఒక్కోపార్ట్‌ను ఊడదీసి పామును బయటకు తీశారు. మూడు అడుగులున్న ఈ విషసర్పం అక్కడున్న వారిని భయపెట్టింది. రెస్క్యూ టీమ్ ఆ పామును అక్కడి నుంచి తీసుకెళ్లి సమీపంలోని అడవిలో వదలేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని హోషంగబాద్‌లో జరిగింది.
Read: విద్యుత్, బొగ్గు సంక్షోభంపై కీలక సమావేశం…