తమిళనాడులో ఓ హృదయ విదారక సంఘటన జరిగింది. అక్టోబర్ 2 వ తేదీన బురదలో కూరుకొని ఒ నాలుగేళ్ల ఏనుగు మృతిచెందింది. చనిపోయిన ఏనుగు సుమారు 1500 కేజీలు ఉండటంతో… చనిపోయిన ప్రాంతంలోనే అంత్యక్రియలు నిర్వహించాలని ఫారెస్ట్ అధికారులు నిర్ణయించారు. కానీ, ఏనుగు చనిపోయిన ప్రాంతానికి సమీపంలోని గ్రామానికి చెందిన పంచాయతీ బావి ఉన్నది. ఏనుగును అక్కడే ఖననం చేస్తే ఆ ప్రాంతంలోని బావి కలుషితం అవుతుందని గ్రామస్థులు చెప్పడంతో ఏనుగును అక్కడి నుంచి తరలించాలని అనుకున్నారు. అయితే, 1500 కేజీల బరువున్న ఏనుగును ఆ బురదనుంచి బయటకు తీయడం సాధ్యం కాకపోవడంతో చనిపోయిన ఏనుగు మృతదేహాన్ని 15 ముక్కలుగా కత్తిరించి అక్కడి తరలించి అంత్యక్రియలు జరిపించారు. చనిపోయిన ఏనుగును ఇలా ముక్కలుగా కత్తిరించి తరలించడం ఇదే మొదటిసారి అని, తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చినట్టు ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఈ సంఘటన తమిళనాడులోని నీలగిరిలోని మాళవన్ చేరంపాడిలో జరిగింది. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కంటతడి పెడుతూ ఏనుగు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.
Read: దెబ్బకొట్టేకొద్దీ ఎదుగుతాను… పవన్ కళ్యాణ్