రాష్ట్రాల పరిధిలో ఉన్న నీటిపై కేంద్రం పెత్తనం మంచిది కాదని తెలంగాణ కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. కేంద్రానికి రాష్ట్రాలు అవకాశం ఇస్తున్నాయని, దీని వలన రాష్ట్రాలు భవిష్యత్తులో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని పొన్నాల పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో జలయజ్ఞంలో భాగంగా ఒకేసారి 86 ప్రాజెక్టులను ప్రారంభించామని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఏం చేశారని ప్రశ్నించారు. లక్షకోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన కాళేశ్వరం వల్ల ఎంత ప్రయోజనం జరుగుతున్నదో కేసీఆర్ చెప్పగలరా అని ప్రశ్నించారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరాలకు అంతరాయం జరుగుతున్నదని, బొగ్గులేక పవర్ ప్లాంట్‌లు మూతపడుతున్నాయని, దీనికి కేంద్రమే బాధ్యత వహించాలని, కేంద్రం వద్ధ భవిష్యత్ ప్రణాళిక లేకపోవడం వలనే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని పొన్నాల మండిపడ్డారు.
Read: బ్రిటన్ పౌరులపై ఆంక్షలు ఎత్తివేత