మొదటి సారి సీబీఎస్‌ఈ పరీక్షలు రాయనున్న10,12 తరగతుల విద్యార్థులకు పరీక్షా కేంద్రం మార్చుకోవడానికి సీబీఎస్‌ఈ బోర్డు అవకాశం కల్పించింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆయా స్కూళ్లను సంప్రదించాలని విద్యార్థులకు సూచించింది. కరోనా కారణంగా ఆయా స్కూళ్ల విద్యార్థులు గ్రామాలకు వెళ్లారు. వీరు తాము ఉన్న చోటు నుంచే పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని గతంలో సీబీఎస్‌ఈని కోరారు. దీని పై స్పందించి సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షాకేంద్రం మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తామని పేర్కొంది. విద్యార్థులు ముందుగా […]
ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇది చాలదన్నట్టు కొండ చరియలు విరిగి పడటంతో చాలా చోట్ల రాకపోకలు బంద్ అయ్యాయి. భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లోని కొండచరియలు విరిగిపడి 52మంది మృతి చెందారు. మరో ఐదుగురి ఆచూకి తెలియరాలేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. కొండ చరియలు విరిగిపడటంతో రెండు రోజులుగా నైనితాల్‌కు పూర్తిగా రాకపోకలు బంద్ అయ్యాయి. కారణంగా గత మూడు రోజుల్లో 8,000మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ […]
పెట్రోల్, డీజీల్ ధరలు రాకెట్ కన్నా వేగంగా దూసుకుపోతున్నాయి. సామాన్యుల జేబులకు చిల్లులుపెడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇవాళ మరోసారి పెట్రోల్, డీజిల్ పై రూ.35 పైసల చొప్పున పెంచారు. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.92, డీజిల్ ధర రూ.103.91కు పెరిగింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.113, డీజిల్ ధర రూ.105.55 గా ఉంది. సెప్టెంబర్ 5 తర్వాత డిజీల్ ధర రూ.6.85, పెట్రోల్ ధర రూ.5.35 కు పెరిగింది. ముడిచమురు కంపెనీల్లో ధరల వ్యతాసాల […]
హెల్ప్‌లైన్ నెంబర్‌ను ప్రారంభించిన UPSCయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) SC/ST/OBC/EWS/PWBD కేటగిరీకి చెందిన అభ్యర్థుల కోసం హెల్ప్‌లైన్ నెంబర్‌ను ప్రారంభించింది. ఇకనుంచి ఏ పరీక్షా లేదా రిక్రూట్‌మెంట్ సంబంధిత విషయాలు తెలుసుకోవడానికి టోల్‌ఫ్రీ నెంబర్1800118711లో ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు. కమిషన్ పరీక్షలు, రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో పాటు దరఖాస్తు చేయడానికి సిద్ధంగా ఉన్న ఇతర అభ్యర్థులు సైతం తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ హెల్ప్‌లైన్ నెంబర్ అన్ని పనిదినాలలో పనిచేస్తుంది. కమిషన్ […]
ఆనంద్ మహీంద్రా నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండటమే కాదు ఆయన పెట్టే పోస్టులు కూడా చాలా కొత్తగా, ఆలోచించే విధంగా ఉంటాయి. క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. వ్యాపార వేత్త కావడంతో ఆయన ఆలోచనలు, సోషల్ మీడియాలో చేసే పోస్టులు కూడా అదేవిధంగా ఉంటాయి. తాజాగా ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. పల్సర్ బండిపై వెనక కూర్చోని దర్జాగా పోతున్న ఓ వ్యక్తికి సంబంధించిన వీడియోను మహీంద్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు. డ్రైవర్ లేకుండానే పల్సర్ బండి […]
ప్రముఖ సోషల్ మీడియా ఫేస్‌బుక్‌కు బ్రిటన్ షాక్ ఇచ్చింది. అడిగిన వివరాలను అందించకుండా జాప్యం చేస్తూ నిర్ణక్షపూరితంగా వ్యవహరించినందుకు 515 కోట్ల రూపాయల జరిమానాను విధించింది బ్రిటన్ కాంపిటీషన్ రెగ్యులేటర్. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ యానిమేటెడ్ సంస్థ జిఫిని ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. ఈ కోనుగోలు తరువాత ఫేస్‌బుక్‌పై అనేక ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియా మధ్య పోటీని ఫేస్‌బుక్ నియంత్రిస్తోందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై బ్రిటన్ కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ విచారణ చేపట్టింది. అయితే, […]
టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం సంచలన వీడియో విడుదల చేశారు. తనను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశముందన్న పట్టాభి ..వీడియో తేదీ, సమయం కూడా చూపించారు. తన ఒంటిపై ప్రస్తుతం ఎలాంటి గాయాలు లేవని చూపించారు పట్టాభి. పోలీసు కస్టడీలో తనకు ప్రాణహాని ఉందని పట్టాభి ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఉదంతం నేపథ్యంలో వీడియో విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు పట్టాభి. తాను ఎలాంటి తప్పు చేయలేదని కోర్టుపై తనకు […]
సాధారణంగా ఒక పార్టీకి ఏ అంశం పైన అయినా ఒకటే విధానం వుంటుంది. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా.. పార్టీలో ఏ పదవిలో వున్నవారైనా వాయిస్ ఒకటే వుంటుంది. కానీ అదేంటో ఏపీలో బీజేపీలో మాత్రం ఒకే అంశంపై రెండురకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతూ వుంటాయి. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు దగ్గర్నించి రాజ్యసభ ఎంపీ జీవీఎల్, మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి వరకూ వివిధ రకాల అభిప్రాయాలు కనిపిస్తాయి. అనేకసార్లు జీవీఎల్, సోము వాయిస్ […]
రేపటి నుంచి 36 గంటల పాటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిరసన దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడులకు నిరసనగా ఈ దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షకు వ్యతిరేకంగా రేపు, ఎల్లుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్షలు చేపట్టబోతున్నట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. టీడీపీ బూతుల వ్యాఖ్యలకు నిరసనగా నియోజకవర్గస్థాయిలో రెండు రోజులపాటు నిరసనలు చేపట్టాలని పార్టీ నిర్ణయించినట్టు తెలిపారు. […]