టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం సంచలన వీడియో విడుదల చేశారు. తనను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశముందన్న పట్టాభి ..వీడియో తేదీ, సమయం కూడా చూపించారు. తన ఒంటిపై ప్రస్తుతం ఎలాంటి గాయాలు లేవని చూపించారు పట్టాభి. పోలీసు కస్టడీలో తనకు ప్రాణహాని ఉందని పట్టాభి ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఉదంతం నేపథ్యంలో వీడియో విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు పట్టాభి. తాను ఎలాంటి తప్పు చేయలేదని కోర్టుపై తనకు పూర్తి నమ్మకం ఉందని వీడియోలో వెల్లడించడం విశేషం.
తనకు ఎలాంటి ప్రాణహాని జరిగినా పోలీసులదే బాధ్యత అని పట్టాభి పేర్కొన్నారు. ఈ వీడియో విడుదల అనంతరం టీడీపీ నేత పట్టాభిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇంటికి వచ్చి పట్టాభిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పట్టాభిని అరెస్ట్ చేసిన పోలీసులు భారీ బందోబస్తు మధ్య గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇదిలా వుంటే… రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రికి చంద్రబాబు లేఖలు రాశారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని లేఖలలో కోరిన చంద్రబాబు..ఏపీలో చోటుచేసుకున్న పరిణామాలపై జోక్యం చేసుకోవాలని చంద్రబాబు కోరారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీ ముఖ్య నేతలు, వారి కార్యాలయాలకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు చంద్రబాబు.