ఇవాళ, రేపు కేఆర్ఎంబీ బృందం కర్నూలు పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ, రేపు కర్నూలు జిల్లాలో నీటి ప్రాజెక్టులను పరిశీలించనుంది 10 మంది కేఆర్ఎంబీ బృందం. కృష్ణానదీ ప్రాజెక్టుల స్వాధీనానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ పై ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన నేపధ్యంలో జిల్లాలో పర్యటిస్తోంది కేఆర్ఎంబీ టీమ్. నేడు మల్యాల, ముచ్చుమర్రి, హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకాలు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యు లేటర్ ను సందర్శించనుంది. రేపు శ్రీశైలం ప్రాజెక్టు, విద్యుత్ కేంద్రాలను పరిశీలించనుంది కేఆర్ఎంబీ టీమ్. అనంతరం శ్రీశైలంలో కేఆర్ఎంబీ టీం సమీక్ష సమావేశం నిర్వహించనుంది.
ఇప్పటికే కేంద్రం గెజిట్ ఇచ్చిన నేపథ్యంలో తమ పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులను తీసుకునేందుకు యత్నిస్తోంది కేఆర్‌ఎంబీ బోర్డు. తెలంగాణ తీరుపై ఏపీ అసంతృప్తిగా వుంది. శ్రీశైలంలో నీటిని వాడుకునే విషయంలో తెలంగాణ అనుసరిస్తున్న వైఖరిపై ఏపీ ఆగ్రహంగా వుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏర్పాటు పై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకరిపై ఒకరు ఫిర్యాదుల నేపధ్యంలో కేఆర్ ఎంబీ సభ్యుల పర్యటన ఉత్కంఠ రేపుతోంది.
Also Read
- AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
- OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
- Nara Lokesh: నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్.. ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్!
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
ఇటు శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుతోంది. ఇన్ ఫ్లో 8,214 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 73,541 క్యూసెక్కులుగా నమోదైంది. జలాశయం పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం 879.20 అడుగుల నీటిమట్టం వుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు. ప్రస్తుతం 183.8486 టీఎంసీలుగా వుంది. జలాశయంలో కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?