RCB Player: యాడ్ షూట్ నుంచి డేటింగ్ వరకు.. ఆ నటితో ఆర్సీబీ ప్లేయర్‌కు పెళ్లి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి) ఆల్ రౌండర్, ఇంగ్లాండ్ యువ క్రికెటర్ జాకబ్ బెథెల్, భారతీయ నటి, మోడల్ ఆద్య ఆనంద్ ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం సాగింది. ఐపీఎల్ 2026 సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని, అది కాస్త ప్రేమగా మారిందని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. గతంలో ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ భారతీయ సంతతికి చెందిన వినీతా రామన్‌ను పెళ్లి చేసుకున్నట్లే, బెథెల్ కూడా ఆద్య ఆనంద్‌ను వివాహం చేసుకోబోతున్నారంటూ నెటిజన్లు అనేక పోస్టులు పెట్టారు.
అయితే ఈ వార్తలపై తాజాగా ఇంగ్లాండ్ క్రికెటర్ జాకబ్ బెథెల్ స్పందిస్తూ ఈ రూమర్లను పూర్తిగా కొట్టిపారేశారు. తాము కేవలం ఒక ఐపీఎల్ యాడ్ షూటింగ్లో మాత్రమే పాల్గొన్నామని, అంతకుమించి తమ మధ్య ఎలాంటి ప్రేమ లేదా డేటింగ్ సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆ యాడ్ షూట్ సమయంలో సరదాగా ఒక ఫోటో దిగామని, అప్పటినుంచి కేవలం స్నేహితులుగా మాత్రమే ఉన్నామని వివరించారు. ఆ షూటింగ్ పూర్తయిన తర్వాత తాము మళ్లీ ఎప్పుడూ కలవలేదని ఆయన కుండబద్దలు కొట్టారు. తమపై వస్తున్న డేటింగ్ వార్తలను చూసి ఆశ్చర్యపోయానని, అవన్నీ కేవలం ఆధారాలు లేని పుకార్లు మాత్రమేనని తెలిపారు.
Also Read
- Pakistan: పాక్‌లో భారీ పేలుడు.. 11 మంది మృతి.. 30 మందికి గాయాలు
- Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..
- Indian Railways Special Trains: దసరా, దీపావళికి ఊరెళ్లే వారికి గుడ్‌న్యూస్.. రైల్వే కీలక ప్రకటన.. రేపటి నుంచే స్టార్ట్..!
- ECI SIR Meeting: ఎన్నికల సంఘం కీలక భేటీ.. SIR గడువులపై కీలక నిర్ణయాలు

మరోవైపు ఆద్య ఆనంద్ మోడలింగ్ రంగంలో రాణిస్తూనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె హిందీలో ప్రజాదరణ పొందిన ‘కృష్డ్’, ‘బాంబే బేగమ్స్’, ‘నాక్ నాక్ కౌన్ హే’ వంటి వెబ్ సిరీస్‌లలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మోడల్‌గా పలు ప్రముఖ బ్రాండ్ల ప్రకటనల్లో కనిపిస్తున్న ఆమె, త్వరలోనే బాలీవుడ్ చిత్రసీమలో పూర్తిస్థాయి అవకాశాలు వస్తే నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఒక ప్రకటన చిత్రీకరణలో కలిసిన సాధారణ పరిచయాన్ని ప్రేమ, పెళ్లి వరకు తీసుకెళ్లి ప్రచారం చేయడంపై క్రీడా ప్రపంచంతో పాటు సినీ వర్గాల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఏది ఏమైనా బెథెల్ స్వయంగా స్పందించి వివరణ ఇవ్వడంతో వీరిద్దరి రూమర్లకు పూర్తిగా తెరపడింది.
తాజావార్తలు
-
Pakistan: పాక్‌లో భారీ పేలుడు.. 11 మంది మృతి.. 30 మందికి గాయాలు
-
Srikanth Odela: “అవును.. నాని అన్నకు నాకు గొడవలు అయ్యాయి!”
-
Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..
-
Indian Railways Special Trains: దసరా, దీపావళికి ఊరెళ్లే వారికి గుడ్‌న్యూస్.. రైల్వే కీలక ప్రకటన.. రేపటి నుంచే స్టార్ట్..!
-
ECI SIR Meeting: ఎన్నికల సంఘం కీలక భేటీ.. SIR గడువులపై కీలక నిర్ణయాలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?