Ajay Bhupathi: ‘మంగళవారం’లో హీరోయిన్ పాయల్ రాజ్‌ఫుత్ క్యారెక్టర్‌పై డైరెక్టర్ అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajay Bhupathi: శ్రీనివాస మంగాపురం సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు, స్టార్ హీరో మహేష్ బాబు అన్న కొడుకు జయ కృష్ణ హీరోగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ రవీనా టాండన్ కుమార్తె రషా థడానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ‘వెంకటప్పయ్య నాయుడు’ అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామా చిత్రం జూలై 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ అజయ్ భూపతి మాట్లాడుతూ.. చేసిన క్రేజీ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన ఈ ఇంటర్వ్యూలో తన సినిమాల ప్రభావం, ‘మంగళవారం’ ప్రత్యేకత, అలాగే తన కొత్త చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి సినిమా ఒకే తరహాలో కాకుండా విభిన్న జానర్లలో ఉండాలని తాను ఎప్పుడూ ప్రయత్నిస్తానని చెప్పారు.
ఆయన ‘RX100’ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ చిత్రం తర్వాత అదే తరహా కథలతో అనేక సినిమాలు వచ్చాయని అన్నారు. ఒక అమ్మాయిని బలమైన, విభిన్న కోణంలో చూపించిన విధానం ఇండస్ట్రీపై ప్రభావం చూపిందని, అదే తన సినిమాల ఇంపాక్ట్ అని పేర్కొన్నారు. అలాగే ‘మంగళవారం’ చిత్రం గురించి మాట్లాడుతూ.. నింఫోమేనియా (సెక్స్ అడిక్షన్)తో బాధపడే మహిళ పాత్రను భారతీయ నేపథ్యంలో మిస్టరీ థ్రిల్లర్‌గా చూపించడం అప్పటి వరకు పూర్తిగా కొత్త ప్రయత్నమని చెప్పారు. కేవలం కథ మాత్రమే కాదు, ఆ సినిమా మేకింగ్ స్టైల్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుందని, ఇప్పటికీ పలువురు దర్శకులు తమ సినిమాలకు ‘మంగళవారం’ను రిఫరెన్స్‌గా ఉపయోగిస్తున్నారని వెల్లడించారు. ఇక తన ప్రస్తుత చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ గురించి మాట్లాడుతూ.. ఇది పూర్తిస్థాయి కమర్షియల్ సినిమా అయినప్పటికీ, ప్రేమకథకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. “ఇది యాక్షన్ సినిమా కాదు.. ప్రేమ కోసం జరిగే యాక్షన్ ఉన్న లవ్ స్టోరీ” అని స్పష్టం చేశారు. ఈ సినిమాలో రస్టిక్ బ్యాక్‌డ్రాప్, సహజమైన పాత్రలు, నిజ జీవితానికి దగ్గరగా ఉండే సన్నివేశాలు ప్రేక్షకులను కథలో పూర్తిగా లీనమయ్యేలా చేస్తాయని అజయ్ భూపతి ధీమా వ్యక్తం చేశారు. విజువల్ ట్రీట్మెంట్, పాత్రల ప్రవర్తనలో ఎక్కడా ఆర్టిఫిషియాలిటీ కనిపించదని, మొదటి పది నిమిషాల్లోనే ప్రేక్షకుడు కథలోకి వెళ్లిపోతాడనే నమ్మకం వ్యక్తం చేశారు. అంతే కాకుండా, ఈ చిత్రంలోని సంగీతం కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని ఆయన అన్నారు. ‘మంగళవారం’ చిత్రానికి వచ్చిన మ్యూజిక్ రెస్పాన్స్ తనకు ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టిందని, ఇప్పుడు ‘శ్రీనివాస మంగాపురం’లో కూడా అద్భుతమైన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని వెల్లడించారు.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!