కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోయర్ మానేరు డ్యాంలో గుర్తు తెలియని యువతి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. ఈ యువతి ఆత్మహత్యకు పాల్పడిందా? లేక ఎవరైనా ఎక్కడైనా హత్యచేసిన లోయర్ మానేరు డ్యాంలో పడేశారా అనేది తేలాల్చి వుంది. యువతి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు.
యువతి ఎప్పుడు మరణించింది. ఎలా మరణించింది అనేది పోస్టు మార్టం రిపోర్ట్ తర్వాతే తేలనుంది. ఈ ఘటనతో లోయర్ మానేరు డ్యాం పరిసరాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. మిస్సింగ్ కేసుల ఆధారంగా కేసు దర్యాప్తు చేయనున్నారు పోలీసులు. ఈతకు వెళ్ళి ఊపిరాక మరణించిందా లేక వేరే కారణాలున్నాయనేది తేలాల్చి వుంది.