సిరివెన్నెల లేని లోటు తీర్చలేనిది..రాజకీయ ప్రముఖుల సంతాపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినిమా గేయరచయిత శ్రీ చేంబోలు సీతారామశాస్త్రి పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. తొలి సినిమా సిరివెన్నెల పేరునే ఇంటి పేరుగా మార్చుకుని తెలుగు భాషకు పట్టం కడుతూ వారు రాసిన విలువలతో కూడిన ప్రతి పాటనూ అభిమానించే వారిలో నేను కూడా ఒకణ్ని. సీతారామశాస్త్రి అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారని తెలిసి కిమ్స్ వైద్యులతో ఫోన్లో మాట్లాడా. వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నాను. వారు త్వరలోనే కోలుకుంటారని భావిస్తున్న తరుణంలో ఈ వార్త వినాల్సిరావడం విచారకరం. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అన్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
ప్రముఖ తెలుగు సినీగేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం. ఎటువంటి సంగీత ప్రక్రియలతోనైనా పెనవేసుకుపోయే అద్భుత సాహిత్యాన్ని సృష్టించిన సిరివెన్నెల, ఆయన మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి, సంగీత సాహిత్య అభిమానులకు తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు సిఎం తన ప్రగాఢ సానుభూతి అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
సిరివెన్నెల మృతి పట్ల సీఎం జగన్ సంతాపం తెలిపారు. తెలుగు సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల. సిరివెన్నెల మరణం తెలుగువారికి తీరని లోటు. అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులు. సిరివెన్నెల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఏపీ సీఎం వైఎస్ జగన్.
సిరివెన్నెల మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ సంతాపం తెలిపారు. సిరివెన్నెల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు చంద్రబాబు, లోకేష్.
తెలుగు పాటని తన సాహిత్యంతో దశదిశలా వ్యాపింపజేసిన ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి నాకు ఎంతో ఆప్తులు. నేను నటించిన చిత్రాలకు వారు అద్భుతమైన పాటలు రాయడం జరిగింది. సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని కలిగించిన వ్యక్తి సిరివెన్నెల. ఆయన ఈ రోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతున్ని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అన్నారు నందమూరి బాలకృష్ణ
ప్రముఖ సినీ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఆకస్మిక మరణం తెలుగు సినిమా రంగానికి, సాహిత్య రంగానికి తీరని లోటు. ఆయన ఆత్మ కు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. సీతారామ శాస్త్రి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలిపారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
సిరివెన్నెల అర్థవంతమైన సాహిత్యం అందించారు. ఆయన లేరని తెలిసి బాధ పడ్డా. సహజ విప్లవ స్వభావం ఉన్న రచయిత. సిరివెన్నెల లేకపోవడంతో కళారంగం చిన్నబోయింది అని సంతాపం తెలిపారు సీపీఐ నేత నారాయణ.
‘సిరివెన్నెల’ మృతి తెలుగు సినిమాకు తీరని లోటు అన్నారు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్. సిరివెన్నెల పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు మంత్రి అవంతి.
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపారు తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. “తెలుగు సినీ జగత్తులో… సిరి వెన్నెల లా వెలిగిన సీతారామ శాస్త్రి కలం ఎన్నో అద్భుతమైన పాటలు జాలు వార్చింది. ఆయన భావం, మాట, పాట ప్రజల్లోకి బాగా వెళ్ళింది. నిందా స్తుతి చేసినా, ప్రేమ ఒలక బోసినా, జీవిత సత్యాలను నిష్టూరంగా చెప్పినా… భావం ఏదైనా, పాట ఏదైనా.. అందులో సీతారామ శాస్త్రి ముద్ర బలంగా ఉంది. వారి మరణం సినీ లోకానికి తీరని లోటు. సీతారామశాస్త్రి గారి స్వరాలకు బాలు గారి కంఠ స్వరానికి అవినాభావ సంబంధం ఉంది. అందుకే బాలు లేని లోకంలో నేను రాయలేను అంటూ… బాలు వద్దకే వెళ్ళిపోయారు. సీతారామ శాస్త్రి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియచేస్తున్నాను.” అన్నారు.
తాజావార్తలు
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!