ఎలక్ట్రిక్ కార్ల రంగంలో టెస్లా రారాజుగా వెలుగుతున్నది. ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ లక్షకోట్ల కంపెనీగా నిలిచిన సంగతి తెలిసిందే. పర్యావరణం ప్రభావం, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. ఇప్పుడు అన్ని ప్రధాన కార్ల కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇక టెస్లా గతంలో సైబర్ ట్రక్ పేరుతో ఓ కారును ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు ఆ కారు విపణిలోకి రాలేదు. అయితే, చైనాకు చెందిన ఎడిసన్ ప్యూచర్స్ కంపెనీ ఈఎఫ్ 1టీ పేరుతో ఇంచుమించు సైబర్ ట్రక్ మాదిరిగా ఉండే కారును తీసుకొచ్చింది.
Read: అసెంబ్లీ ఆవరణలో మద్యం బాటిళ్లు… మండిపడుతున్న విపక్షాలు…
ఇది ఎలక్ట్రిక్‌తో పాటుగా సోలార్‌తో కూడా నడుస్తుంది. ఈ పికప్ ట్రక్‌ను నవంబర్ 19 వ తేదీన లాస్ ఎంజల్స్‌లో జరిగిన ఆటో షోలో ప్రదర్శించారు. ఉదయం సమయంలో ప్రయాణం చేసే సమయంలో ట్రక్ పైనున్న సోలార్ ప్యానళ్ల ద్వారా 25 నుంచి 30 కిమీ దూరం ప్రయాణం చేసేందుకు వీలుగా బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది. ట్రక్ వెనకభాగం మూసినపుడు పికప్ ట్రక్ మాదిరిగా మారిపోతుంది. ఇక ఈఎఫ్ 1 టీ కారును ఒకసారి ఛార్జింగ్ చేస్తే 724 కిమీ ప్రయాణం చేయగలదు. 2025లో ఈ ట్రక్‌ను మార్కెట్‌లోకి తీసుకురాబోతున్నారు.