Bhatti Vikramarka : సింగరేణి బ్లాకులు ప్రైవేట్ పరమైతే తీవ్ర ప్రమాదం
- బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణపై భట్టి ఆందోళన
- బీఆర్ఎస్, బీజేపీలపై ఘాటు విమర్శలు
- 20 ఏళ్ల బొగ్గు అవసరాలకు కొత్త ప్రణాళిక
- సింగరేణి భవిష్యత్తుపై ప్రభుత్వం ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సింగరేణి బొగ్గు బ్లాకులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళితే సంస్థ ఉనికికే తీవ్ర ప్రమాదమని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. భద్రాద్రి జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ, గతంలో వేలంలో పాల్గొనకపోవడం వల్లే రెండు బొగ్గు బ్లాకులు ప్రైవేటు పరం అయ్యాయని, తమ ప్రభుత్వం వచ్చాక ఈ పరిస్థితిని మార్చి సింగరేణిని వేలం పాటల్లో పాల్గొనేలా అనుమతులు ఇచ్చామని తెలిపారు. గత పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వంలో పేరుకుపోయిన బకాయిలను తాము అధికారంలోకి వచ్చాక సమన్వయంతో సరిచేస్తున్నామని స్పష్టం చేశారు. పదేళ్ల క్రితం బిఆర్ఎస్, బిజెపిలు అధికారంలో ఉన్నప్పుడు నోరు మెదపకుండా, తాటిచెర్ల బ్లాక్‌ను అడ్డుపెట్టుకుని ఇప్పుడు సింగరేణిపై నకిలీ ప్రేమ ఒలకబోస్తున్నారని, ఈ విషయాన్ని కార్మికులు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు.. పునరావృతం కానివ్వం
గత ప్రభుత్వ హయాంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల డిమాండ్‌కు తగ్గట్టుగా సరైన ప్రణాళికలు రూపొందించకపోవడం వల్లే నేడు తీవ్ర బొగ్గు కొరతను ఎదుర్కోవాల్సి వస్తోందని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ పునరావృతం కాకుండా తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని స్పష్టం చేశారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా రాబోయే 20 సంవత్సరాలకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, అందులో భాగంగానే ఈ క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు.
Also Read
- Ganja Smuggling Busted: ఒడిశా టు హైదరాబాద్.. గంజాయి స్మగ్లింగ్‌కు చెక్..
- Chit Fund Fraud : చిట్టీల పేరుతో రూ.5 కోట్ల టోపీ.. వ్యాపారికి జైలు
- Hit and Run : నార్సింగిలో హిట్ అండ్ రన్.. డెలివరీ బాయ్ దుర్మరణం
- SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
తాజావార్తలు
-
Venky Atluri: ఆయన ఎక్కడుంటే అక్కడ డబ్బే.. ఇండస్ట్రీలో ఆ హీరో జడ్జిమెంట్‌కి తిరుగులేదు!”.
-
Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
-
Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
-
MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
-
Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!