టెస్లా కారు రాజసానికి ప్రతీకగా మారింది. ఎలక్ట్రిక్ కార్ల రంగంలో టెస్లా దూసుకుపోతున్నది. లక్షకోట్ల డాలర్ల కంపెనీగా అవతరించింది. టెస్లా ఎన్నో రకాల మోడల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో టెస్లా ఎస్ మోడల్ కారును వాహనదారులు పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. ఈ కారును కొనుగోలు చేసిన ట్యుమస్ అనే వ్యక్తికి టెస్లా చుక్కలు చూపించింది. మొదటి 1500 కిలోమీటర్లు కారు చాలా అద్భుతంగా ఉందని, 1500 కిమీ ప్రయాణం తరువాత సమస్యలు రావడం మొదలయ్యాయని, ఆటోమేషన్ సిస్టమ్ ఎర్రర్ చూపించడంతో టెస్లా సర్వీస్ షోరూమ్‌కి తీసుకెళ్లాడట.
Read: ఆ ఐదు పుస్తకాలు ముఖేష్ అంబానీకి హెల్ప్ అయ్యాయట… ఎలానో తెలుసా…!!
కారు రిపేర్‌కి రూ. 17 లక్షలు బిల్లు వేశారట. పట్టుమని 1500 కిమీ కూడా ప్రయాణం చేయని కారు రిపేర్‌కు 17 లక్షల బిల్లు కావడం ఎంటని ప్రశ్నించాడు. కారుతో పడలేమని భావించిన ట్యుమస్ ఆ కారును మంచు ప్రాంతానికి తీసుకెళ్లి కారులో 30 కేజీల డైనమైట్‌ను అమర్చి పేల్చేశాడు. దీనికి సంబంధించిన న్యూస్ విజువల్స్ వైరల్ అవుతున్నాయి.