ఈరోజుల్లో అన్నీ ఆన్ లైన్ చెల్లింపులే జరుగుతున్నాయి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా చెల్లిస్తుంటాం. అయితే, జనవరి1, 2022 నుంచి కొన్ని నిబంధనలు మారబోతున్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డులు వాడేవారు వీటిని తెలుసుకోవడం తప్పనిసరి. జనవరి 1, 2022 నుండి బ్యాంక్ ఖాతాదారులు తమ కార్డ్ నంబర్, గడువు తేదీ మొదలైన వాటి వివరాలను గూగుల్ సేవ్ చేయదు. అటువంటి పరిస్థితిలో, జనవరి 1 నుండి మాన్యువల్ ఆన్లైన్ చెల్లింపు చేస్తున్నప్పుడు, మీరు మాన్యువల్‌గా మీ […]
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి 49వ జన్మదినోత్సవానికి అంతా సిద్ధం అయింది. వైసీపీ నేతలు ఎవరికి వారు తమదైన రీతిలో తమ అభిమాన నేత పుట్టినరోజు వేడుకలు జరిపేందుకు రెడీ అయ్యారు. గుంటూరు జిల్లాలో వైసీపీ నేతల మధ్య వైరం రోడ్డున పడింది. గుంటూరు జిల్లా దాచేపల్లి వైసీపీలో ఫ్లెక్సీ వివాదం చినికి చినికి గాలివానగా మారింది. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వర్గీయులు. గామాలపాడు […]
దేశంలో చమురు ధరలు భారీగా పెరుగుతుండటంతో వాహనాలకు బయటకు తెచ్చేందుకు ఆలోచిస్తున్నారు. లీటర్ పెట్రోల్ ధర రూ. 110 కి చేరింది. అటు డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగాయి. దీంతో వాహనాదారుల చూపులు ప్రత్యామ్నాయ మార్గాలపై పడింది. చమురు వాహనాలకు పక్కన పెట్టి ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. టూవీలర్స్‌తో పాటు అనేక కార్లకంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేస్తున్నాయి. 2022లో అనేక కంపెనీలు కొత్త ఎలక్ట్రిక్ కార్లను విపణిలోకి రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. […]
దేశంలోని కీలక కంపెనీల సీఈఓలతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. వచ్చే ఏడాది బడ్జెట్ దృష్ట్యా సీఈఓల సలహాలు, సూచనలను మోడీ తీసుకున్నారు. దేశ ఆర్థిక వృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. కార్పొరేట్ సెక్టార్‌కు కేంద్రం అందిస్తున్న ప్రోత్సహాకాలను సీఈఓలకు వివరించారు. దేశీయంగా పారిశ్రామిక ఉత్పత్తిని పెంచాలని సూచించారు. రక్షణ రంగంలో కొత్త సాంకేతికత ఆవశ్యకతపై చర్చించారు.ప్రధానంగా దేశంలో నూతన ఆవిష్కరణలపై దృష్టి పెట్టేలా ఆయా కంపెనీల సీఈఓలకు ప్రధాని మోడీ సూచించారు. దేశం ఆర్థిక రంగంలో […]
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2019 జూలై నుంచి చెల్లించాల్సిన 5.24 శాతం కరవు భత్యాన్ని విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన కరువు భత్యాన్ని 2022 జనవరి నెల జీతంతో కలిపి విడుదల చేసేందుకు గానూ ప్రభుత్వం ఆమోదం తెలియచేసింది. జనవరి జీతంతో కలిపి మూడు విడతలుగా పెరిగిన కరవు భత్యం చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. డీఏలో 10 శాతాన్ని ప్రాన్ ఖాతాలకు మిగతా 90 శాతం మొత్తాన్ని నేరుగా […]
తెలంగాణలో విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం పెంచిన సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్. బీసీ, ఈబీసీ, డీఎన్ టీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయాన్ని పెంచడంపట్ల తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కే. కిశోర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత ఓబీసీ, ఈబీసీ స్కాలర్ షిప్స్ కి విద్యార్థుల కుటుంబ ఆదాయ పరిమితి పెంచింది. వార్షిక ఆదాయం పరిమితి రెండున్నర లక్షలకు పెంచారు. పోస్ట్ […]
పెళ్లైన కొత్త జంట డ్యాన్స్ చేయడం ఇప్పుడు షరా మామూలే అయింది. పెళ్లికి ముందు సంగీత్, పెళ్లి తరువాత రిసెప్షన్లో డ్యాన్స్ చేస్తుంటారు. ఇలానే ఓ జంట వివాహం చేసుకున్నాక సరదాగా స్టెప్పులు వేయడం మొదలుపెట్టారు. అలా స్టెప్స్ వేస్తున్న సమయంలో అనుకోకుండా ఓ అతిధి వారి దగ్గరకు వచ్చింది. వరుడు రెండు కాళ్ల మధ్యలోకి దూరి అక్కడి నుంచి వధూవరుల మధ్యలోకి వచ్చి నిలబడింది. మీరు చేస్తున్న డ్యాన్స్ నాకు నచ్చడం లేదు అన్నట్టుగా ఫేస్ […]
దేశంలో మరో పెద్ద ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. యూపీలో ఇప్పటికే యమునా ఎక్స్‌ప్రెస్ వే ఉండగా, మరో ఎక్స్‌ప్రెస్ వే ను నిర్మించేందుకు సిద్ధమయింది. ఉత్తరప్రదేశ్‌లో ఏకంగా 464 కిమీ ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టును అదానీ ఎంటర్‌ప్రైజస్ దక్కించుకుంది. ఇందులో భాగంగా తొలిదశకింద బుధౌన్ నుంచి ప్రయాగ్‌రాజ్ వరకు నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్టు విలువ రూ. 17 వేల కోట్లు. పీపీపీ కింద ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంతో దీనిని నిర్మిస్తున్నారు. Read: […]
యూనివర్శిటీలో వుండే అనధికారిక విద్యార్ధినీ, విద్యార్ధులకు అల్టిమేటం ఇచ్చింది ఉస్మానియా వర్శిటీ. డిసెంబర్ 27న, అన్ని సెమిస్టర్ల ప్రారంభ తేదీ దగ్గర పడుతోంది, హాస్టళ్లలో ఉంటున్న అనధికార వ్యక్తులందరూ 24 డిసెంబర్ 2021 (శుక్రవారం) మధ్యాహ్నం 12.00 గంటలలోపు గదులను ఖాళీ చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ సూచించింది. హాస్టళ్లలో అవాంఛనీయ సంఘటనలు, అసౌకర్యాలను నియంత్రించడానికి అనధికార వ్యక్తులను హాస్టళ్ల నుండి ఖాళీ చేయాలని బోనఫైడ్ విద్యార్థులు విశ్వవిద్యాలయ అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఖాళీ చేయని వారిని […]
తెలంగాణ ఆర్టీసీని గాడిన పెట్టేందుకు ఎండీ వీసీ సజ్జనార్ నడుం బిగించారు. ఇప్పటికే సిబ్బందిలో జవాబుదారీ తనం పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఆర్టీసీ బాస్ ఇప్పుడు ఆదాయ వనరులు పెంచేందుకు, ఖర్చులు తగ్గించే పనిలో పడ్డారు. అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో అదనపు సిబ్బందిని తగ్గించాలని ఆయన నిర్ణయించారు. బస్ భవన్లో ఖర్చులు తగ్గించడం, అవసరం లేని సిబ్బందిని ఇతర విభాగాలకు కేటాయించడం చేయాలని నిర్ణయించారు. అదనపు సిబ్బందిని గుర్తించాలని, ఆదాయం పెంచుకునే కొత్త మార్గాలను అన్వేషించాలని ఉన్నతాధికారులకు సూచించారు […]