తెలంగాణ రాష్ట్రలో ఉద్యోగ దంపతుల బదిలీపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రం వ్యాప్తంగా భార్యభర్తలు ఒకే చోట పని చేసేలా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. కొత్త జోనల్ కేటాయింపుల్లో చేరిన తర్వాతే ఉద్యోగుల్లో ఉండే భార్యభర్తలు దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్త జోనల్ వ్యవస్థ కేటాయింపులు అయిన తర్వాతే భార్య భర్తల బదిలీ విషయంలో ఆలోచిస్తామని […]
టెస్లా ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేస్తూ వస్తున్నది. టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ కార్లకు ఎంత డిమాండ్ ఉన్నదో చెప్పాల్సిన అవసరం లేదు. టెస్లా లక్షకోట్ల డాలర్ల కంపెనీగా అవతరించింది. కాగా, టెస్లా కంపెనీ ఇప్పుడు మొబైల్ తయారీ రంగంలోకి కూడా ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోందని వార్తలు వస్తున్నాయి. గత కొన్ని నెలలుగా దీనిపై వార్తలు వస్తున్నాయి. అయితే, ఎలన్ మస్క్ దీనిని ఖరారు చేయలేదు. మోడల్ పైపీ పేరుతో స్మార్ట్ ఫోన్లను తయారు […]
తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ పై అసహనం వ్యక్తం చేసింది తెలంగాణ హైకోర్ట్. జరిమానా కూడా విధించింది. నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ జీవోపై హైకోర్టు విచారణ జరిగింది. జీవో 123 చట్టబద్ధతపై 2016లో దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారించింది. కౌంటర్లు దాఖలు చేయాలని లేదా హాజరు కావాలని గత నెలలో సీఎస్ ను ఆదేశించింది హైకోర్టు. అయితే కౌంటర్లు దాఖలు చేయనందుకు సీఎస్ సోమేష్ కుమార్ పై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. హాజరు మినహాయింపు […]
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లపై అమెరికా 20 ఏళ్ల పాటు జరిపిన పోరాటంలో పాకిస్తాన్ భాగస్వామ్యం కావడంపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా.. కేవలం డబ్బు కోసమే అమెరికాతో తమ దేశం అప్పట్లో చేతులు కలిపిందని వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్‌లో మంగళవారం విదేశాంగ శాఖ అధికారుల సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడారు. ”ఇతరులు మనల్ని వాడుకునేందుకు నాడు మనమే అవకాశమిచ్చాం. దేశ ప్రతిష్టను పణంగా పెట్టాం. ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా కాకుండా, డబ్బు […]
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. రెండు వ్యాక్సిన్లు తీసుకున్నా ఒమిక్రాన్ వేరియంట్ రక్షణ వ్యవస్థను దాటుకొని విజృంభిస్తుండటంతో కొత్త సంవత్సరం వేడుకలపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. కొత్త సంవత్సరం వేడుకలపై కర్ణాటక సర్కార్ నిషేధం విధించగా, క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఢిల్లీ సర్కార్ నిషేధం విధించింది. కాగా, హర్యానా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి జనవరి 1 తరువాత పూర్తి వ్యాక్సిన్ తీసుకోని వారిని రోడ్డు మీదకు రాకుండా కట్టడి […]
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇన్చార్జ్ పదవిపై టీడీపీ అధినాయకత్వం స్పష్టతనిచ్చింది. ఎంపీ కేశినేని నానికి విజయవాడ పశ్చిమ బాధ్యతల అప్పగిస్తూ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే విజయవాడ పశ్చిమ ఇన్చార్జ్ పదవిని చివరి వరకు బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా ఆశించినప్పటికీ చంద్రబాబు కేశినేని వైపే మొగ్గు చూపారు. బుద్ధా, నాగుల్ మీరాకు ఇప్పటికే వేర్వేరు బాధ్యతలు ఉన్నందున పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పదవిని కేశినేనినానికి అప్పగించారు. నియోజకవర్గంలో డివిజన్ స్థాయి కమిటీలను నియమించుకునేందుకు కేశినేని […]
ఢిల్లీ పర్యటనలో ఉన్న బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ అమిత్ షాతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలో ఉన్నారో లేదో తెలుసుకోకుండానే మంత్రులు ఢిల్లీకి వచ్చారా అంటూ విమర్శించారు.చావు డప్పు కొట్టించారు..ముఖ్యమంత్రికి అసలు సిగ్గుఉందా.. అంటూ ప్రశ్నించారు. రైతులు ఆందోళన చెందద్దని చెప్పిన సీఎం కేసీఆర్, పూటకో మాట మారుస్తూ వరి వేస్తే ఉరి” అని […]
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర బోడ్ ప్రైమరీ పాఠశాలకు తాళం వేశారు. దీంతో పాఠశాల ముందే విద్యార్థులు పడిగాపులు పడుతున్నారు. ప్రధానోపాధ్యాయురాలి నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు ఇక్కట్లు పడుతున్నారు. ఎన్ని సార్లు చెప్పినా తీరు మారడం లేదని విమర్శలు వస్తున్నాయి. మహబూబాబాద్ పట్టణంలోని వెంకటేశ్వర బోడ్ లోని ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న పొన్నమ్మ సమయపాలన పాటించడం లేదు. పిల్లలను సరిగా పట్టించుకోకపోవడం, చదువులు సరిగా బోధించకపోవడం, విద్యార్ధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వీటికి తోడు […]
పద పదవే గాలిపటమా… అనే పాట గుర్తుంది కదా… మన దగ్గర సంక్రాంతి వస్తే గాలిపటాలు ఎగరవేస్తుంటారు. గాలిపటాల పందేలు నిర్వహిస్తుంటారు. దీనికోసం పెద్ద ఎత్తున గాలిపటాలు తయారు చేస్తుంటారు. గాలిపటాల వేడుకలు మనదగ్గరే కాదు, శ్రీలంకలోనూ ఘనంగా నిర్వహిస్తుంటారు. శ్రీలంకలో తై పొంగల్ వేడుకల్లో గాలిపటాలు ఎగరవేయడం ఆనవాయితి. అక్కడ గాలిపటాల పందేలను పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. పోటీల్లో పాల్గొనే ఔత్సాహికులు వివిధ ఆకృతుల్లో గాలిపటాలు తయారు చేసి ఎగరవేస్తుంటారు. Read: యూపీలో కొత్త […]
పుట్టిన గడ్డ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు యశోద హాస్పిటల్స్ గ్రూపు యాజమాన్యం. తమ మాతృభూమి అయిన మేడిపల్లి-రాంపూర్ గ్రామాల్లో రూ 1.50 కోట్లతో ఫంక్షన్‌హాల్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను అందుబాటులోకి తెచ్చారు. తల్లి పేరుతో మొదలుపెట్టిన యశోద హాస్పిటల్స్ గ్రూపు తెలుగు రాష్ర్టాల్లో ప్రముఖ వైద్య సేవల కేంద్రంగా నిలిచింది. ఈ సంస్థ వ్యవస్థాపకులు గోరుకంటి రవీందర్రావు, గోరుకంటి సురేందర్‌రావు, గోరుకంటి దేవేందర్రావులు సొంతూరికి ఏదైనా చేయాలనే తపనతో ఒక్కొక్కటిగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. […]