టీడీపీ అధినేత చంద్రబాబు జైలు నుంచీ బయటకు వస్తారని ఆశిస్తున్నాను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్ ఒక లాల్ బహాదూర్ శాస్త్రి, వాజ్ పేయి అయితే నేను ఇలా మాట్లాడను.. వచ్చే దశాబ్ద కాలం మనం కలిసి పనిచేయాలి అని టీడీపీకి చెపుతా.. 2009లో కోల్పోయిన నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను అని ఆయన పేర్కొన్నారు.
నువ్వెంత నీ బ్రతుకెంత జగన్ అంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి నుంచీ మీడియాలో ఏం వాక్కుంటారో వాక్కోండి.. మేం ఏమీ మర్చిపోలేదు.. ఇదే పోలీసు స్టేషన్ లో పంచాయితీ పెడతాం మీకు.. ఏ పోలీసులను మీరు ఇబ్బంది పెట్టారో అదే పోలీసులతో మీ మక్కెలు విరగ్గొట్టిస్తాం.. కొల్లేరు ప్రజలకు జనసేన, టీడీపీ వచ్చి బలమైన న్యాయం చేస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు.
కేసీఆర్ తన కొడుకును ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించే దమ్ముందా..? అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. ఆయనను సీఎం అభ్యర్ధిగా ప్రకటించిన మరుక్షణమే బీఆర్ఎస్ పార్టీ చీలిపోతుంది అని ఆయన వ్యాఖ్యనించారు.
సారూ.. కారు... పదహారు అన్నారు ఏమయింది?.. ఢిల్లీలో చక్రం తిప్పుతా అన్నారు.. బొంగురం కూడా తిప్పలేదు అని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్. లక్ష్మణ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ రెండు సభలు జస్ట్ ట్రైలర్ మాత్రమే.. సినిమా ముందుంది అని ఆయన ఎద్దేవా చేశారు.
Unstoppable 3 to Start Soon: నందమూరి బాలకృష్ణ కెరీర్ మొత్తం మీద అనేక సినిమాలతో హిట్లందుకున్నారు ఫ్లాపులు అందుకున్నారు కానీ ప్రేక్షకులకు బాగా దగ్గరైన షో ఏదైనా ఉంది అంటే అది అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే అని చెప్పక తప్పదు. అంతకు ముందు వరకు నందమూరి బాలకృష్ణ అంటే కోపిష్టి అని చిన్న చిన్న విషయాలకు కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తారు అంటూ మీడియాలో, సోషల్ మీడియాలో జరిగే ప్రచారం మొత్తాన్ని ఈ […]
Siddu Jonnalagadda Intresting Comments: సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమవుతున్న ‘మ్యాడ్’ సినిమాకి ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ కీలక పాత్రలలో నటించారు. అక్టోబర్ 6న థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ […]
విశాఖ ఉక్కు అప్పులను నష్టాలుగా చూపించి కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం అన్యాయం అంటూ సీతారాం ఏచూరి మండిపడ్డారు. వ్యవస్థను మొత్తం పెట్టుబడిదారుల చేతుల్లోకి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెడుతోంది అని ఆయన విమర్శలు గుప్పించారు.
Narne Nithin intresting comments on NTR at MAD Prerelease Event: ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమవుతున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘మ్యాడ్’ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్యదేవర నాగ వంశీ సమర్పిస్తున్న ఈ సినిమాని ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ […]
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ కి చుక్కెదురు అయింది. హెచ్‌సీఏ ఓటరు జాబితా నుంచి అజారుద్దీన్ పేరును తొలగించింది. హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేశారు.
Rathinirvedam Movie to re relase on November 11th: ఈ మధ్య కాలంలో తెలుగు సినీ రీరిలీజ్‌లు ఎక్కువ అవుతున్నాయి. మొన్నటి వరకు స్టార్ హీరోల సినిమాలు మాత్రమే మళ్లీ రిలీజ్ చేస్తూ రాగా ఇప్పుడు మాత్రం చిన్న హీరోల సినిమాలు, వివాదాస్పద సినిమాలు అప్పట్లో మంచి క్రేజ్ అందుకున్న సినిమాలను కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇక తాజాగా అప్పట్లోనే బోల్డ్ మూవీగా పేరు తెచ్చుకున్న ‘రతి నిర్వేదం’ రీరిలీజ్ చేస్తున్నట్లుగా అనౌన్స్ చేశారు, అప్పుడు […]