Unstoppable 3 to Start Soon: నందమూరి బాలకృష్ణ కెరీర్ మొత్తం మీద అనేక సినిమాలతో హిట్లందుకున్నారు ఫ్లాపులు అందుకున్నారు కానీ ప్రేక్షకులకు బాగా దగ్గరైన షో ఏదైనా ఉంది అంటే అది అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే అని చెప్పక తప్పదు. అంతకు ముందు వరకు నందమూరి బాలకృష్ణ అంటే కోపిష్టి అని చిన్న చిన్న విషయాలకు కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తారు అంటూ మీడియాలో, సోషల్ మీడియాలో జరిగే ప్రచారం మొత్తాన్ని ఈ షో ఒక్కసారిగా తుడిచి పెట్టేసింది. మొదటి సీజన్లో 10 ఎపిసోడ్లు చేసి సూపర్ సక్సెస్ కావడంతో దానికి సంబంధించిన రెండవ సీజన్ కూడా ప్లాన్ చేశారు. అది కూడా చంద్రబాబు లాంటి గెస్ట్ లతో సూపర్ సక్సెస్ అయింది. ఇక దానికి సంబంధించిన మూడో సీజన్ ఉంటుందా? లేదా? అంటూ చాలా రోజులుగా రకరకాలు చర్చలు జరుగుతున్నాయి. అయితే తాజాగా మూడవ సీజన్ కు సంబంధించిన అగ్రిమెంట్లు పూర్తయినట్లు తెలుస్తోంది.
Siddu Jonnalagadda: గుంటూరు కారం సాంగ్ కి థియేటర్లు తగలబడిపోతాయి
దసరా సమయంలో మొదటి ఎపిసోడ్ షూటింగ్ కూడా ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో ప్రచారం జరిగిన దాని మేరకు ఆహా వర్గాలు ఈ మూడవ సీజన్ ప్లాన్ చేస్తే కనుక మొదటి ఎపిసోడ్ మెగాస్టార్ చిరంజీవితో చేయాలని బలంగా నిర్ణయించుకున్నారని, ఆ మేరకు మెగాస్టార్ చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు మొదటి ఎపిసోడ్ షూటింగ్ కి ప్లాన్ చేశారని తెలుస్తోంది. నిజానికి సినీ పరిశ్రమలో ముందు నుంచి నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ -చిరంజీవి మధ్య పోటీ ఎక్కువగా ఉండేది. పోటాపోటీగా సినిమాలు రిలీజ్ చేయడమే కాదు వారి అభిమానులు సైతం ఎప్పటికప్పుడు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ కామెంట్లు చేసుకునేవారు. అలాంటిది ఇప్పుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా ఈ ప్రోగ్రాం చేయబోతున్నారని వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. చూడాలి మరి ఏమవుతుందో?