కేసీఆర్ తన కొడుకును ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించే దమ్ముందా..? అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. ఆయనను సీఎం అభ్యర్ధిగా ప్రకటించిన మరుక్షణమే బీఆర్ఎస్ పార్టీ చీలిపోతుంది అని ఆయన వ్యాఖ్యనించారు. నీ కొడుకు అహంకారం చూసి మెడకాయ మీద తలకాయ ఉన్నోడెవరూ బీఆర్ఎస్ కు ఓట్లేయరు.. కేసీఆర్ కొడుకుకు కండకావరం తలకెక్కింది అంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు, సమ్మక్క సారలమ్మ గిరిజన యూనివర్శిటీ ఏర్పాటుతో పాటు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్న కృష్ణా ట్రిబ్యునల్ కు విధివిధానాలు ఖరారు చేస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
Read Also: Tirumala: అక్టోబర్ 15 నుంచి తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఎలా దర్శనం?
బిడ్డా.. నీ అర్హత సీఎం కొడుకు మాత్రమే.. కేసీఆర్ లేకపోతే నిన్ను కుక్కలు కూడా దేకవు అంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముడతల చొక్కా, రబ్బర్ చెప్పులేసుకుని జీవితం నీది.. వేల కోట్లు ఎట్లా సంపాదించినవ్.. ప్రజల సొమ్మును దోచుకున్నది నిజం కాదా? లక్షలు, కోట్ల ఆశచూపి బీజేపీ నేతలను బీఆర్ఎస్ లోకి లాక్కోవాలని చూస్తున్నారు. థూ… ధైర్యంగా కొట్లాడే దమ్ములేని బతుకు మీది.. పొరపాటున కేసీఆర్ మళ్లీ అధికారంలోకొస్తే… తెలంగాణ పరిస్థితి శ్రీలంక మాదిరిగా మారుతుంది.. ఆ పరిస్థితి రాకూడదంటే బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని బండి సంజయ్ కోరారు. ఢిల్లీ గులాంలు మాకొద్దని చెబుతున్న కేసీఆర్… ఆ కుటుంబానికి తెలంగాణ ప్రజలు గులాం కావాల్నా? గతంలో గుజరాత్ బిడ్డకే వంగి వంగి పాదాభివందనం చేసిన సంగతి మర్చిపోయినవా? అని బండి సంజయ్ విమర్శించారు.
Read Also: India-Canada: “అంతర్గత విషయాల్లో జోక్యం”.. కెనడా దౌత్యవేత్తల తగ్గింపుపై భారత్..
ముఖ్యమంత్రి కేసీఆర్ కనబడక నెలరోజులాయే అని బండి సంజయ్ అన్నారు. మా గురువుని మీరు ఏం చేశారు? ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తూ గొప్ప నిర్ణయం తీసుకున్నాక కూడా కేసీఆర్ బయటకు ఎందుకు రాలేదు? పీఎంకు థ్యాంక్స్ చెప్పలేదు? కేసీఆర్ యాడున్నడో.. ఏం చేస్తున్నడో కనీసం ఆయన బూతు ఛానల్ అయినా ఎందుకు చూపించడం లేదు? అంటూ బండి సంజయ్ మండిపడ్డారు. బిడ్డా, కొడుకు, అల్లుడుతో కలిసి దోచుకోవడం దాచుకోవడమే కేసీఆర్ కుటుంబం పని.. కేసీఆర్ కు మందు గోళీలు ఇచ్చే సడ్డకుడి కొడుకును ఇంట్లో నుండి బయటకు ఎందుకు వెళ్లగొట్టాడో చెప్పాలి? అని ఆయన డిమాండ్ చేశారు.
Read Also: BJP MP Laxman: ఢిల్లీలో చక్రం తిప్పుతామన్నారు.. బొంగురం కూడా తిప్పలేదు
ఇక, కృష్ణా జలాల వాటా, వివాదాలు పరిష్కారం కాబోతున్నాయని బండి సంజయ్ అన్నారు. ఎడారిగా మారిన దక్షిణ తెలంగాణ సస్యశ్యామలం అయ్యే అవకాశముంది. కృష్ణా జలాల వాటాలో సీఎం కేసీఆర్ చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు.. నాటి ఏపీ సీఎం చంద్రబాబుతో కుమ్కక్కై తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను రాకుండా అడ్డుకున్న నెంబర్ వన్ ద్రోహి కేసీఆర్ అని ఆయన ఆరోపించారు. ఏపీ, తెలంగాణకు సంబంధించి 2015లో జూన్ 18, 19 తేదీల్లో నీటి పంపకాలపై కేంద్రం సమావేశం ఏర్పాటు చేసినప్పుడు కూడా కేసీఆర్ నీటి పంపకాలపై నోరు మెదపలేదు అని బండి సంజయ్ ఆరోపించారు.