బీఆర్ఎస్ తో పొత్తుకు సంకేతాలు ఇచ్చినట్లు కేటీఆర్ చెప్పడం సిగ్గుమాలిన చర్య అని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కలిసి నడిచాం.. ఎన్నికల్లో కలవలేదు.. అబద్ధాలకు పెట్టింది పేరు బీఆర్ఎస్.. మోడీ అసలు రహస్యాన్ని బయట పెట్టారు.. అందితే జుట్టు.. లేకపోతే కాళ్ళు పట్టుకోవడం బీఆర్ఎస్ వ్యవహార శైలి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. BRS ది పచ్చి అవకాశ వాదమే.. బీఆర్ఎస్ రాజకీయ పరాన్నజీవి.. ముఖ్యమంత్రి చేస్తే TRS దుకాణం బంద్ చేస్తామని చెప్పింది వాస్తవం కాదా.. వాస్తవాలు చెబితే, కుడితిలో పడ్డ ఎలుకలా వ్యవహరిస్తున్నారు అని ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు.
Read Also: Lifestyle : ఆడవారిని ఇలా చూడటానికి మగవారు ఎందుకు ఇష్టపడతారో తెలుసా?
సారూ.. కారు… పదహారు అన్నారు ఏమయింది?.. ఢిల్లీలో చక్రం తిప్పుతా అన్నారు.. బొంగురం కూడా తిప్పలేదు అని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్. లక్ష్మణ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ రెండు సభలు జస్ట్ ట్రైలర్ మాత్రమే.. సినిమా ముందుంది అని ఆయన ఎద్దేవా చేశారు. బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్పడం కల్వకుంట్ల కుటుంబానికి అలవాటే అని ఆయన అన్నారు. బీజేపీ ఒక సిద్ధాంతానికి కట్టుబడి, ప్రజాప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకునే పార్టీ అన్నారు.
Read Also: Unstoppable 3: గెట్ రెడీ ఫోక్స్… అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే లోడింగ్
అయితే, జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీ వచ్చి తనను కలిశారని, కేటీఆర్‌ను సీఎంగా చేస్తే.. తాము ఎన్డీఏలో చేరతామనే విషయాన్ని కేసీఆర్ ప్రతిపాదించారని ప్రధాని మోడీ నిజామాబాద్ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక, ప్రధాని మోడీ కామెంట్స్ పై మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇస్తూ.. అసలు తాము ఎన్డీఏలో చేరడం కాదు.. రాష్ట్రంలో బీజేపీ పార్టీనే తమతో కలిసి వస్తానంటే.. అందుకు తాము ఒప్పుకోలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.