వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆరంభ పోటీలో న్యూజిలాండ్ బౌలర్లు అదరగొట్టారు. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ తీసుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లు ముగిసేసరికి తొమ్మిది వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది.
The Great Indian Suicide: మదనపల్లెలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’ అక్టోబర్ 6 నుంచి ఆహాలో అయ్యేందుకు సిద్ధం అయింది. ఈ సినిమాకు విప్లవ్ కోనేటి దర్శకత్వం వహించగా హెబ్బా పటేల్ ప్రముఖ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నరేశ్ వీకే, పవిత్రా లోకేష్, తమిళ నటుడు జయప్రకాశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్ 6 నుంచి ఆహాలో ప్రసారం కానున్న సందర్భంగా ఈ సినిమా ప్రెస్ […]
టీడీపీ బలహీన పడిందని పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కి టీడీపీ వాళ్ళు ఒప్పుకున్నారా?.. టీడీపీ పార్టీ బలహీన పడిందని పవన్ అన్నారు.. టీడీపీని పవన్ టెకోవర్ చేస్తున్నారా?.. టీడీపీకి పవన్ ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పాలి అని సజ్జల డిమాండ్ చేశారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి మరోసారి ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబుకు మరో 14 రోజులు రిమాండ్ ను ఏసీబీ న్యాయస్థానం పొడిగించింది. ఈ నెల 19 వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగిస్తున్నట్లు చంద్రబాబుకు ఏసీబీ జడ్జ్ చెప్పారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన పాపాలు రాయలసీమకి శాపాలుగా మారుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. జగన్ చేసిన నేరాలు, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకి ఉరివేస్తున్నాయి.. అక్రమాస్తుల కేసుల మాఫీ కోసం ప్రత్యేక హోదా వదులుకున్నాడు అని ఆయన విమర్శించారు.
ఇవాళ భారత్ లో ప్రారంభమైన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ తొలి మ్యాచ్ చూస్తే అలాంటి సీన్ ఏదీ కనిపించలేదు.. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నేడు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, గత వరల్డ్ కప్ రన్నరప్ న్యూజిలాండ్ టీమ్స్ రెండు తలపడుతున్నాయి. అయితే, రెండు జట్లు వన్డే ఫార్మాట్ లో హేమాహేమీలే.. కానీ, 1.32 లక్షల సీటింగ్ కెపాసిటీ కలిగిన ఈ అతిపెద్ద స్టేడియంలో ప్రేక్షకులు అక్కడొకరు, ఇక్కడొకరు ఉన్నట్టుగా కనిపించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 15 రోజులుగా చీకట్లోకి వెళ్ళిపోయారు అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పాలన చూస్తే తెలంగాణ ఎందుకు వచ్చిందని బాధగా అనిపిస్తుంది.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంగంట్లో అమ్మకానికి పెట్టిన సరకుగా మారింది.. రాష్ట్రంలో భార్యాభర్తలు కలిసి సంసారం చేయలేకపోతున్నారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ్కి చేరుకున్నారు. సీఎం అధికారిక నివాసం 1 జన్ పథ్ కు ఆయన చేరుకున్నారు.. ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం జగన్ సమావేశం కానున్నారు.
ఓటుకు నోటు అనేది ఒకటి ఇవ్వడం.. మరొకటి తీసుకోవడం అని ఎలక్షన్ కమిషనర్ చీఫ్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఓటుకు నగదు పంపిణీ ఎక్కువ సంఖ్యలో అనేది మా దృష్టికి వచ్చింది.. రాబోయే ఎన్నికల్లో పటిష్టమైన నిఘా పెడుతున్నామని ఆయన చెప్పారు.