NTV WebDesk
Author- NTV Telugu-
Hyderabad: బైకుపై వెంబడించి యువతికి వేధింపులు.. ఫలితం ఇదీ!
మనిషి హాయిగా బ్రతకాలంటే ఏదైనా ఉపాధి కావాలి. అందుకే సొంతంగా వ్యాపారం కొందరు చేస్తుంటే..! మరి కొందరు ఉద్యోగాలు చేస్తుంటారు. ప్రస్తుత సమాజంలో పురుషులకు పోటీగా మహిళలు ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. ప్రైవేట్ తో పాటు ప్రభుత్వ రంగంలోనూ మహిళలు మెరుగైన ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఐతే మహిళలు ఎక్కడ పనిచేస్తూన్నా వారికి వేధింపులు ఎదురవుతూనే ఉన్నాయి. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్న యువతిని వేధించిన యువకుడికి నాంపల్లి కోర్టు ఐదు రోజుల జైలు శిక్ష విధించింది. బాధితురాలి […] -
CM KCR: రాలేగావ్ సిద్ది పర్యటన రద్దు ?
సీఎం కేసీఆర్ శుక్రవారం (ఇవాళ) చేపట్టాల్సిన రాలేగావ్ సిద్ది (మహారాష్ట్ర) పర్యటన రద్దయినట్లు సమాచారం. ఇదివరకు సీఎంవో ప్రకటించినదాని ప్రకారం.. ముఖ్యమంత్రి మే 26న బెంగళూరు, 27న రాలేగావ్ సిద్ది పర్యటన చేపట్టాల్సి ఉంది. రాలేగావ్ సిద్దిలో ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేతో భేటీ కావాల్సి ఉంది. అనంతరం షిర్డీ వెళ్లి సాయిబాబాను దర్శించుకుని హైదరాబాద్‌కు చేరుకుంటారని సీఎంవో గతంలో వెల్లడించింది. ఈమేరకు సీఎం 26న బెంగళూరుకు వెళ్లి, సాయంత్రం 7 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌కు తిరిగి […] -
Ambassador Car: సరికొత్త అవతారంలో రానున్న ‘కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్’
అంబాసిడర్ కార్.. ఈ ఐకానిక్ కార్ గురించి తెలియని భారతీయుడు ఉండడు. ‘కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్’గా పిలిచే ఈ కారు తయారీ 2014 నుంచి ఆగిపోయింది. విదేశీ కార్లపై భారతీయుల మోజు పెరిగిపోవడం, అంబాసిడర్ అమ్మకాలు తగ్గిపోవడం, అప్పుడు కూడా పెరిగిపోవడంతో.. హిందూస్తాన్ మోటార్స్ వీటి తయారీని నిలిపింది. అయితే, ఇప్పుడిది సరికొత్త అవతారంలో త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. అంబాసిడర్ 2.0 గా రెండేళ్ళలో మార్కెట్లోకి రానుందని ఆ సంస్థ ప్రకటించింది. ఫ్రాన్స్‌కు చెందిన ప్యూజట్ […] -
Sabitha Indra Reddy: అయ్యా మోదీ.. మీ వాటా గుండు సున్నా!
హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల్ని బాధించిందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. ఐటీఐఆర్, పాలమూరు ప్రాజెక్ట్‌లకు జాతీయ హోదా ప్రకటిస్తారేమోనని ఎదురుచూస్తే.. అవేమీ ఇవ్వకపోగా తన హోదాకు తగినట్లు మాట్లాడలేదని అన్నారు. ఒక విద్యాలయం కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చి రాజకీయాలు మాట్లాడటం సమంజం కాదన్నారు. రాజకీయాలకు బదులు తెలంగాణ విద్యార్థుల కోసం నూతన విద్యాలయాలపై ఏదైనా ఒక ప్రకటన చేసి ఉంటే, తెలంగాణ సమాజం హర్షించేదన్నారు. ‘బేటి […] -
Hyderabad: వాహనదారులకు శుభవార్త.. ఫ్లైఓవర్లపై స్పీడ్ పెంపు
హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాల్ని నివారించేందుకు.. రీసెంట్గా ప్రభుత్వం స్పీడ్ లిమిట్ విషయమై కొత్త నియమాల్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే! ప్రధాన రహదారులపై కారు 60 కి.మీ. వేగంతోనూ, ఆటోలు & బైక్‌లు 50 కి. మీ. వేగంతోనే ప్రయాణించాలని నిర్దేశించింది. కాలనీ రోడ్లలో గరిష్టంగా 30 కి. మీ. వేగంతోనే వెళ్ళాలని.. అంతకుమించి వేగంగా వెళ్తే ఫైన్స్ వేయడం జరుగుతుందని హెచ్చరించారు. బుధవారమే ఈ స్పీడ్ లిమిట్‌పై అధికార ప్రకటన విడుదల చేయడం జరిగింది. అయితే.. […] -
Errabelli Dayakar Rao: మోదీని గద్దె దింపడమే కేసీఆర్ లక్ష్యం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గట్టి కౌంటర్లిచ్చారు. అవగాహన లేకుండా, చరిత్ర తెలియకుండా, మోదీ చేసిన వ్యాఖ్యలు.. ఆయన పదవికి తగ్గట్టుగా లేవన్నారు. మోదీకి కుటుంబం లేదని, అందువల్లే ఆయనకు సెంటిమెంట్లు తెలియవని అన్నారు. సీఎం కేసిఆర్‌ది కుటుంబ పాలన కాదని చెప్పిన ఎర్రబెల్లి.. తెలంగాణ కోసం ఆయన కుటుంబం ఉద్యమించి, జైళ్ళకు పోయి, త్యాగాలు చేసిందన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన వారిని […] -
Crime News: యాక్సిడెంట్లో ముగ్గురు మృతి, 3 గంటలపాటు రాస్తారోకో
ఖమ్మం జిల్లాలోని కోదాడ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కోదాడ నుంచి ఖమ్మం వెళ్తున్న బస్సు.. గోకినపల్లి సమీపంలో ఆటోని ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మృతుల్లో ఒకరు రెండేళ్ళ చిన్నారి ఉంది. ఆటో నుజ్జునుజ్జయ్యింది. మృతదేహాలు చిందరవందరగా పడిపోయాయి. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగానే ఉందని వైద్యులు చెప్తున్నారు. మృతులు నేలకొండపల్లి […] -
Sandra Venkata Veeraiah: మోదీ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు
హైదరాబాద్ పర్యటనలో భాగంగా నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విస్తృత స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ వచ్చి వరాల జల్లు కురిపిస్తానని ప్రకటన చేసిన మోదీ.. ఇక్కడికొచ్చిన తర్వాత చిల్లర రాజకీయాలు చేస్తున్నారని వీరయ్య విమర్శించారు. చిల్లర రాజకీయాలకు బేగంపేట విమానాశ్రయాన్ని వేదికగా చేసుకోవడం అత్యంత బాధాకరమైన విషయమన్నారు. తెలంగాణ రాష్ట్రం, టిఆర్ఎస్ పార్టీ మీదున్న అక్కసును వెళ్ళగక్కడానికే హైదరాబాద్ పర్యటనని ఉపయోగించుకున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు, మేధావులు, పెద్దలు రాష్ట్రం కోసం […] -
Harish Rao: వరాలు ప్రకటిస్తారు అనుకున్నాం.. కానీ!
హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కుటుంబ రాజకీయాల మీద చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. గురువింద గింజ తన కింద నలుపు చూసుకోవాలన్న ఆయన.. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కుమారుడు బీజేపీలో లేడా? మీది కుటుంబ పార్టీ కాదా? పంజాబ్‌లో అకాళీదళ్‌తో అధికారాన్ని పంచుకోలేదా? అది కుటుంబ పార్టీ కాదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కుటుంబ రాజకీయాల గురించి మోదీ మాట్లాడటం నిజంగా సిగ్గు చేటని, మీ ఎత్తులు ఎత్తి […] -
WhatsApp: యూజర్లకు గుడ్ న్యూస్.. ఆ సమస్యకు చెక్
చాలాకాలం క్రితమే వాట్సప్ ‘డిజప్పియరింగ్ మెసేజెస్’ (Disappearing Messages) ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే! ఈ ఫీచర్‌ని ఎనేబుల్ చేస్తే.. పరిమిత కాలంలో ఆటోమెటిక్‌గా మెసేజెస్ డిలీట్ అయిపోతాయి. 24 గంటలు, 7 రోజులు, 90 రోజులు అంటూ గడువు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ మూడింటిలో ఏదైనా ఒక సమయం సెలెక్ట్ చేస్తే.. సరిగ్గా ఆ గడువు ప్రకారం సింగిల్ చాట్స్‌లో గానీ, గ్రూప్స్‌లో గానీ మెసేజెస్ డిలీట్ అవుతాయి. కాకపోతే.. దీని వల్ల ఒక […]
తాజావార్తలు
-
Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
-
AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!